ఓటర్లు అడగకున్నా నడిచొచ్చె నజరానా!?
తెలంగాణ స్టేట్*** రంగారెడ్డి జిల్లా **మొయినాబాద్** ఫిబ్రవరి 10 **(ఏఐఎంఏ మీడియా)
*నడిచొచ్చె నజరానా!*
* రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పురపాలక సంఘంలో ఒక వార్డు అభ్యర్థి.. నలుగురు ఓటర్లున్న కుటుంబాన్ని రాత్రి పూట ఓటు అడిగేందుకు వెళ్లారు. వారికి ఉన్న పాత టీవీ స్థానంలో సరికొత్త ఎల్‌ఈడీ టీవీ అందించి అందరి కాళ్లు మొక్కి.. తనకే ఓటేయాలని ప్రమాణం చేయించుకున్నారు. ఈ సమాచారం తెలిసిన ప్రత్యర్థి.. సరికొత్త ఫ్రిజ్‌తో ఆ ఇంటికి వెళ్లారు. సమాన ధర్మం పాటించాలని నాలుగు ఓట్లలో రెండు తనకే వేయాలంటూ ఒట్టు పెట్టించుకుని మరీ వచ్చారు.