logo

ప్రసాదం లడ్డు వ్యవహారంపై టీడీపీ కుట్ర - నిప్పులాంటి నిజాలు



జంతువుల కొవ్వు లేదన్నది CBI-SIT ల్యాబ్ రిపోర్ట్ తోనే తేలిపోయిందని,
లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు కలవలేదనీ దేశంలోనే ప్రతిష్టాత్మమైన NDDB, NDRI లు స్పష్టం చేశాయని
డా. తలే రాజేష్ అన్నారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన ప్రసాదం లడ్డూ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ టీడీపీ నాయకత్వం మరోసారి దిగజారిన కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది అని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం.
భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన తిరుమల లడ్డూను కూడా రాజకీయ అజెండాకు ఉపయోగించాలనే దురుద్దేశంతో, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించడమే టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోంది.
నిప్పులాంటి నిజాలు ఇవే
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలన పారదర్శకంగా, సంప్రదాయాలకు అనుగుణంగా సాగింది. లడ్డూ తయారీ, నాణ్యత, శుద్ధతపై ఎక్కడా రాజీ పడలేదు.

లడ్డూ తయారీలో వాడే ముడిసరుకులు, నాణ్యత ప్రమాణాలు, పరీక్షలపై కఠినమైన నియంత్రణ వ్యవస్థ అమల్లో ఉంది. దీనిపై అనుమానాలకు తావే లేదు.
టీడీపీ పాలనలో జరిగిన అక్రమాలు, అవకతవకలు ప్రజలకు గుర్తున్నాయనే భయంతో, ఇప్పుడు భక్తుల విశ్వాసాలను టార్గెట్ చేసి దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
నిజంగా లడ్డూ విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే, అప్పట్లో తమ పాలనలో జరిగిన లోపాలపై ఎందుకు మాట్లాడలేదో సమాధానం చెప్పాలి.
దేవాలయాలను, దేవుని ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకోవడం సనాతన ధర్మానికి విరుద్ధం, భక్తుల మనోభావాలను గాయపరిచే చర్య.

మా స్పష్టమైన హెచ్చరిక

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్రతను ప్రశ్నించేలా, లడ్డూ పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే, వైఎస్ఆర్సీపీ దీనిని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.
భక్తుల విశ్వాసాలను కాపాడటమే మా వైఎస్ఆర్సిపి లక్ష్యం.
రాజకీయ లాభాల కోసం దేవుణ్ని కూడా వాడుకునే సంస్కృతి మాకు లేదు.

టీడీపీ వెంటనే ఈ దుష్ప్రచారాన్ని ఆపాలి.
అబద్ధాలతో కాదు – నిజాలతో ప్రజల ముందుకు రావాలి.
లేకపోతే ప్రజలే కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ అన్నారు.

లడ్డూ పేరుతో దుష్ప్రచారం చేస్తే,
ప్రజలే లెక్క అడుగుతారు…
భక్తుల విశ్వాసాలతో ఆటలు ఆడితే, తీర్పు ఘాటుగానే ఉంటుందని మండిపడ్డారు.

చంద్రబాబు హయాంలో సప్లై అయి, రిజెక్ట్ అయిన నాలుగు ట్యాంకర్లు నుంచి తీసుకున్న శాంపిళ్ళ మీదే ఈ కేసు నడుస్తోంది, టీటీడీ రిజెక్ట్ చేస్తే తిరిగి అవి దొడ్డిదారిన టీటీడీ లోకి వచ్చాయి. మరి కల్తీ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా అని అన్నారు.
320 రూ.లకే కేజీ నెయ్యి దొరుకుతుందా? అంటూ ప్రశ్నిస్తున్న చంద్రబాబు, తన హయంలోనే ఇదే కంపెనీ రూ.320, రూ.321 లకే చాలా సార్లు నెయ్యిని సప్లై చేసిందన్నారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని
స్వయాన తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారని, ఇది నచ్చక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందనే మూర్ఖత్వంతో ఉన్నారని స్వయంగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు టంకాల అచ్చెన్నాయుడు , రాజాం టౌన్ పార్టీ అధ్యక్షులు పాలవలస శ్రీనివాస రావు, రాజాం రూరల్ పార్టీ అధ్యక్షులు లావేటి రాజగోపాల్ నాయుడు, జడ్పీటీసీ బండి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

6
245 views