logo

15వ ఆర్థిక సంఘం నిధులపై ఆంక్షలు చట్టవిరుద్ధం: బిల్లులు వెంటనే చెల్లించాలని ఎం.పి.పి మామిడి అప్పలనాయుడు డిమాండ్


15వ ఆర్థిక సంఘం నిధులపై ఆంక్షలు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 3082065 చట్ట వ్యతిరేకమని, ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని విజయనగరం మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీల్లో సర్పంచులు 2024-2025 వార్షిక ప్రణాళిక ప్రకారం, ప్రభుత్వ నిబంధనలు 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పనులు చేశారని ఆయన తెలిపారు. ఇప్పటికే బిల్లులు చెల్లించాల్సి ఉండగా, చేసిన పనులకు ఇప్పుడు బిల్లులు చెల్లించకుండా ఆంక్షలు పెడుతూ ఆదేశాలు ఇవ్వడం సరికాదని, వెంటనే ఇటువంటి ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీలో ఉన్న నిధులతో వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు చేసి, సర్పంచులు మార్చి నెల ఆఖరులోగా తమ పదవీ కాలంలో పూర్తి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు తగు చర్యలు తీసుకోవాలని సెక్రటరీలకు సూచించారు. సర్పంచులకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సెక్రటరీలను ఆదేశించారు.
ఈ సమావేశంలో డివై ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

0
0 views