logo

గురువు భయం లేకపోతే చదువు సంస్కారం ఎలా వస్తుంది?

తల్లిదండ్రులారా! చేతులు జోడించి 🙏 విన్నపం.. పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే!పాఠశాలలు క్రమశిక్షణకు విరుద్ధంగా మారాయి. విద్యార్థుల హెయిర్ స్టైల్, నడవడిక, ప్రవర్తనలపై ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు లేదు. ఉపాధ్యాయులు నిస్సహాయంగా చూస్తుంటారు. తల్లిదండ్రుల శ్రద్ధ, నియంత్రణ లేకపోతేనే ఇలా తయారవుతారు! క్రమశిక్షణ మాటలతో రాదు – కొద్దిపాటి దండన, భయంభక్తి ఉంటేనే వస్తుంది.పిల్లలకు బడిలో భయం లేదు, ఇంట్లో భయం లేదు. ఫలితం? సమాజం ఈ భయభ్రాంతులకు గురవుతోంది. అభం-శుభం తెలియని వారు రౌడీలుగా తిరిగి, పోలీసుల చేతుల్లో పడి కోర్టుల్లో శిక్షలు అనుభవిస్తున్నారు. గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది – ఇది నిర్ధారిత సత్యం. గురువుకు భయం, గౌరవం లేకుండా చదువు-సంస్కారం ఎలా పెరుగుతాయి?"కొట్టొద్దు! తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్‌వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్ల తప్పు!" – ఇదే ఈ రోజుల నీతి!పాఠశాలల్లో దారుణ పరిస్థితి: నిజ ఉదాహరణలు5వ తరగతి నుంచే కటింగ్ స్టైల్, చినిగిన జీన్స్‌లు, గోడలపై కూర్చోవడం. వచ్చేవారిని, వెళ్ళేవారిని కామెంట్స్ చేయడం. "అరేయ్ సార్ వస్తున్నారురా!" అంటే "వస్తే రానియ్" అని తిరగడం. దరిద్రం ఏమంటే, తల్లిదండ్రులే "మావాడు చదవకున్నా ఏమి కాదు, మావాడిని కొట్టవద్దు" అంటున్నారు. "ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది?" అంటే "మా నాన్న సార్" అని చెప్పడం!పెన్ను ఉంటే పుస్తకం లేదు, పుస్తకం ఉంటే పెన్ను లేదు. భయం కలిగించాలంటే రెండు దెబ్బలు వేయాలన్నా, పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువ. కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా? భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంటే!స్కూల్లో తప్పు చేసినా కొట్టకూడదు, తిట్టకూడదు, మందలించకూడదు – ప్రేమతో చెప్పాలి. ఇదెలా సాధ్యం? మొదటి తప్పు క్షమించి ఊరుకుంటే సమాజం ఎలా మారుతుంది? మంచి నేర్పేవారికి (టీచర్లకు) హక్కులు లేవు. చిన్నప్పుడు కొడితే నేరం, పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం!తల్లిదండ్రుల బాధ్యత: 70% పిల్లల సమస్యలు ఇప్పుటి తరం 70% పిల్లలు: తల్లిదండ్రులు కారు, బండి శుభ్రం చేయమంటే చేయరు, మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్లరు, లంచ్ బ్యాగ్‌లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు, ఇంటి చిన్న చిన్న పనుల్లో సహాయం చేయరు, రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6-7 గంటలలోపు లేవరు, గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు, తిడితే వస్తువులను విసిరి కొడతారు; డబ్బు ఇస్తే ఐస్‌క్రీమ్‌లు, నూడుల్స్, ఫ్రెండ్స్ పార్టీలు, గిఫ్ట్‌లు, మైనర్ పిల్లలకు బైక్‌లు – ఆక్సిడెంట్లు, కేసులు, ఆడపిల్లలు తిన్న కంచం కూడా కడగటం లేదు; ఇల్లు ఊద్చమంటే కోపాలు, అతిథులకు గ్లాస్‌లో నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేలేవు, 20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు, బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం, కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు; వారిస్తే వెర్రి పనులుమనమే పిల్లల చేత అన్నీ చేయించడం వల్ల ఇలా అయింది. కారణం? మన అహం, పరువు, ప్రతిష్టలు – చూసేవారి ముందు రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలనే భ్రమ. గారాబంతో పెరిగినవారు మార్పు చెప్పినా మారదు. వారిని కష్టపెట్టమని కాదు, కష్టం గురించి తెలిసేలా పెంచండి. కష్టం, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే జీవిత విలువ తెలియదు.ప్రేమతో, గారాబంగా చేస్తున్న తప్పుల వల్ల 15 ఏళ్లకే ప్రేమ-దోమ, సిగరెట్‌లు, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్‌లు, హత్యలు చేస్తున్నారు. మరికొందరు సోమరిపోతున్నారు. అభినయాలు కనపడవు, అణకువ లేదు, సంస్కృతి పట్టించుకోవడం లేదు. ఇలాగే ఉంటే తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా పోతుంది భార్యకు వంట రాకపోతే బిర్యానీలు, కర్రీ పాయింట్‌ల వల్ల చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్‌లు. పెరుగు-మజ్జిగ తినకుండా వాంతులు . కాలేజీ పిల్లలు ఒక పిడికి టిఫిన్ రైస్, ఫ్రూట్‌లు తినరు.గర్భవతులైన తర్వాత టోటల్ మెడిసిన్ డిపెండెంట్, 100లో 90 మంది సిజేరియన్‌లు శారీరక పటుత్వం పడిపోయింది. పుట్టే పిల్లలు జన్యు లోపాలతో వస్తున్నారు. 3వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి కళ్ళద్దాలు, 5వ తరగతిలో అల్సర్-బీపీలు, 10వ తరగతి దాటేలోపు ఎన్నో సమస్యలు. వీటికి కారణం మనమే సరైన పెంపకం లేకపోవడం.సంస్కృతి-సాంప్రదాయం: నిజమైన అర్థంకేవలం గుడి-దర్గా పూజలు చేసి సంస్కృతి అనడం పొరపాటు. పిల్లలకు చిన్న వయసులోనే అలవాటు చేయాలి:బాధ్యత, మర్యాద, గౌరవంకష్టం, నష్టం, ఓర్పు, సహనందాతృత్వం, ప్రేమ, అనురాగంసహాయం, సహకారం, నాయకత్వంమానసిక దృఢత్వం, కుటుంబ బంధాలు, అనుబంధాలుదైవ భక్తి, దేశ భక్తికొంచెం కష్టమైనా ఇవి తప్పక అలవాటు చేయండి. ఇవి అలవాటైతే ఆరోగ్యం, మానసిక స్థితి, సామాజిక సృజనం, ఉత్తమ జీవన విధానం వారికి అందుతుంది.మనవి: 90% టీచర్ల పక్షం పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులు తోనే జరుగుతుంది. ఒకరిద్దరి తప్పులకు అందరిని నిందించవద్దు. 90% టీచర్లు పిల్లల బాగుకోసమే వ్యవహరిస్తారు ఇది యదార్థం. మేము చదువుకున్న రోజుల్లో కొంతమంది టీచర్లు కొట్టేవారు, కానీ పేరెంట్స్ వచ్చి నిలదీయలేదు "మా బాగుకోసమే" అన్నారు.ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం-భయం ఉండేలా పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వండి. మీ పిల్లల భవిష్యత్తుపై ఆలోచించండి. భావితరాల కోసం, పిల్లలను మార్చే బాధ్యత మనందరిపై ఉంది.

12
935 views