
మా జేష్ట పుత్రుడు అదృత్ ఆవన్ అన్నప్రాసన శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో నిర్వహించడం జరిజరిగింది
** ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ దంపతులు,
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**భద్రాచలం 08** ఫిబ్రవరి 26*
మా జేష్ట పుత్రుడు అదృత్ ఆవన్ అన్నప్రాసన శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో నిర్వహించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
ఆదివారం నాడు ఐ టి డి ఏ పీవో రాహుల్ మరియు శ్రీమతి మనిషా రాహుల్ దంపతులు తమ కుమారుడి అన్నప్రాసన చేయించడానికి దేవస్థానానికి వచ్చిన పిఓ దంపతులకు దేవస్థానం పర్యవేక్షకుడు అర్చక స్వాములు ఘనంగా స్వాగతం పలికి వరి వట్టం అందజేసి ఆశీర్వచనాలతో ఘనంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నప్రాసన కార్యక్రమం కాగానే పిఓ దంపతుల చేత గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, లక్ష్మీ తాయారామ్మ వారిని, శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పిఓ మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న భద్రాచలంలో తన కుమారునికి అన్నప్రాసన కార్యక్రమం చేయడం మాకు దక్కిన అదృష్టమని ఈ సందర్భంగా చాలా చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం సతీమణి ప్రవీణ, డాక్టర్ రేపాక సాత్విక, మాధవి అర్చక స్వాములు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
-