logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆదివాసీ విద్యార్థుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : ఆదివాసీ జేఏసీ

ప్రతి ఆశ్రమ పాఠశాలలో ఇద్దరేసి ఏఎన్ఎం లను నియమించాలి

జనం న్యూస్ 9 పోలవరం నియోజకవర్గం రిపోర్టర్ : సోమరాజు నడపాల

షెడ్యూల్డ్ ప్రాంతంలో ఆదివాసీ విద్యార్థుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ప్రకటనలో డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతిపురం మన్యం జిల్లా,గుమ్మలక్ష్మీపురం మండలం,రేగిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని రూపవతి ఇటీవల అనారోగ్యానికి గురైంది. పాఠశాల సిబ్బంది రేగిడి పి.హెచ్.సిలో చికిత్స చేసి అనంతరం కురుపాం పి.హెచ్.సికి తరలించారు.అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ లో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందింది.2024,2025 సంవత్సరాలలో కూడా పలువురు ఆదివాసీ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలో పిట్టల మృత్యువాత పడుతున్న సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు శాశ్వత పరిష్కారం కోసం నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.కావున ఆదివాసీ విద్యార్థుల మృతులపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేసి మృతులకు కారకులైన బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధిత ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.ట్రైబల్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి రాష్ట్రా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఇద్దరేసి ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేస్తానన్న హామీని తక్షణమే ఎ.ఎన్.ఎం పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రతి ఆశ్రమ పాఠశాలలో గైనకాలజిస్ట్ డాక్టర్లను నిర్మించాలని డిమాండ్ చేశారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలోని ఆదివాసీ ప్రజలు జీవించే హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ప్రకటనలో డిమాండ్ చేశారు.లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.

3
179 views

Comment