logo

భాను సప్తమి పర్వదినం రోజు నదిహారతికి ఒక విశిష్టత ఉందని, * బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు రామ వజ్జల రవికుమార్*

తెలంగాణ స్టేట్*** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*** భద్రాచలం గోదావరి తీరం** ఫిబ్రవరి 09 **(ఏఐఎంఏ మీడియా)

భాను సప్తమి పర్వదినం రోజు సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన దినమును పురస్కరించుకొని భక్తుల కోలహాలం జై జై దానాలతో భద్రాచలం గోదావరి మాత నదిహారతి పురోహితుల మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా జరిగిందని దేవస్థానం ఈవో దామోదర్ రావు అన్నారు.

ఆదివారం నాడు శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలో గోదావరి కరకట్ట ప్రదేశాలలో జరిగిన నదీహారతి కార్యక్రమములో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారిక పనులపై వెళ్లి అందుబాటులో లేనందున ఆయన సూచనల మేరకు నదీ హారతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి ఉదయం దయనందన కార్యక్రమాలు ముగించుకొని వీలును బట్టి గంగా స్నానం ఆచరించి సూర్య భగవానునికి నమస్కరించి, అనంతరం ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకుంటారని అన్నారు. ఈ రోజు నదిహారతికి ఒక విశిష్టత ఉందని, భాను సప్తమి పర్వదినం సూర్య భగవానుడికి అతి ప్రీతిపాత్రమైన రోజున శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న ప్రదేశంలోని గోదావరి తీరంలో సాయంత్రం ఐదు గంటలకు భద్రాచలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ చిన్నారులతో ప్రత్యేక భజన కార్యక్రమం మరియు భక్తి గీతాలతో భక్తుల జై శ్రీ రామాయన మహా అని శ్రీరామ స్మరణతో గోదావరి నదికి భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు రామ వజ్జల రవికుమార్ ఆధ్వర్యంలో గోదావరి హారతి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు నదిహారతి కార్యక్రమంలో పాల్గొని పునీతులు అవుతున్నారని అన్నారు.
అనంతరం పురోహితులు గోదావరి హారతి విశేషాలను ముందుగా వినిపించి, గణపతి పూజ, జైశ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం భక్తులనే స్రుశింప చేసి పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారని, పురోహితులు
శ్రీరామ అష్టోత్తరం పటిస్తుండగా ఓం శ్రీ రామాయన మహా అంటూ108 సార్లు భక్తులచే శ్రీరామ నామ భజన అనంతరం ముందుగా సీతారామచంద్రస్వామి వారికి12 సార్లు హారతి ఇచ్చిన ఆనంతరం గోదావరి నదికి 21 సార్లు హారతిఇవ్వడం జరిగిందని, లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహాత్కార్యంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, రామాను గ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందుతున్నారని ఆయన అన్నారు
. అనంతరం శాంతి మంత్ర పఠనం జరిపి, భద్రాచలం శ్రీ పి వి ఎస్ ఎన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పులిహోర ప్రసాదం, నైవేద్యం, శనగలు భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని, నదిహారతి కార్యక్రమానికి పూజా సామాగ్రి బట్టల షాప్ అసోసియేషన్ భద్రాచలం వారు అందించారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, జిపిఈఓ శ్రీనివాసరావు, పురోహితులు సురేష్ వర్మ, పవన్ కుమార్ వర్మ, అశోక్ కుమార్, కృష్ణమాచార్య, కారంబరీ కృష్ణ శర్మ, రామాచార్యులు, తేజ, సామెతి శేషాచార్యులు, స్వచ్చంద సంస్థలు, భద్రాద్రి కా మహారాజు ప్రతినిధులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

18
1200 views