logo

భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల భక్తులకు ఉచిత బస్సు సదుపాయం శ్రీశైల దేవస్థానం

*ఉచిత బస్సు సదుపాయం*

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు.
భక్తులు సౌకర్యార్థం వారు దిగినచోటు నుంచి ఆయా ప్రదేశాలు వెళ్ళేందుకు దేవస్థానం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది.ఈ బస్సులు కైలాసద్వారం నుండి శ్రీశైలం వరకునడపబడుతున్నాయి.అదేవిధంగా నందిగుడి సర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్, విభూతిమఠం జంక్షన్, మల్లమ్మకన్నీరు, శివాజీస్ఫూర్తికేంద్రం, రుద్రాపార్కు, సిద్ధరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేటు సత్రాల మీదుగా మరల నందిగుడి సర్కిల్‌కు చేరుకుంటాయి.
కాగా భక్తులరద్దీని బట్టి ఈ రోజు ( 08.02.2026) నాలుగు బస్సులు నడపబడుతున్నాయి.
రేపు ( 09.02.2026) కూడా నాలుగు బస్సులను నడపడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ నెల 10 మరియు 11 తేదీలలో రోజుకు ఎనిమిది బస్సులు నడపబడుతాయి.
అలాగే 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రోజుకు 10 బస్సులను నడపడం జరుగుతుంది.

16
4244 views