logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సింహాచలం దేవస్థానం కొత్త ఈవో జే వెంకట్రావు దేవస్థానం

విశాఖపట్నం (సింహాచలం)

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా జె. వెంకటరావు అత్యంత భక్తిశ్రద్ధలతో బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటివరకు ఇంచార్జ్ ఈఓగా వ్యవహరించిన శ్రీమతి ఎన్.సుజాత నూతన ఈఓ కి అధికారికంగా బాధ్యతలను అప్పగించారు.

తొలుత తన సతీమణితో కలిసి ఆలయానికి చేరుకున్న వెంకటరావు దేవస్థానం అర్చకులు,అధికారులు నాదస్వర వేద మంత్రాల నడుమ సాదర స్వాగతం పలికారు.అనంతరం వారు ధ్వజస్తంభానికి మొక్కుకుని,గర్భాలయంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.అర్చకులు వారికి స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శింపజేసి,ప్రత్యేక పూజలు నిర్వహించారు.

92 జంటలతో వైభవంగా'స్వాతి హోమం' స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన స్వాతి హోమంలో నూతన ఈఓ దంపతులు పాల్గొన్నారు.లోక కల్యాణార్థం,క్షేత్రాభివృద్ధి కోసం జరిగిన ఈ హోమంలో 92 మంది భక్త జంటలు పాల్గొని స్వామివారికి ఆహుతులు సమర్పించారు.హోమ గుండం నుండి వెలువడిన ఆధ్యాత్మిక ప్రకంపనల మధ్య,వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. హోమానంతరం పండితులు ఈఓ దంపతులకు ఆశీర్వచనం అందించి,తీర్థ ప్రసాదాలు,శేష వస్త్రాన్ని బహూకరించారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస వాస్తవ్యులైన జె.వెంకటరావు 1995 నుండి రెవెన్యూ రంగంలో విశేష సేవలు అందించారు. తహశీల్దార్ నుండి డిప్యూటీ కలెక్టర్ వరకు,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన, క్రమశిక్షణ కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారిగా తనదైన ముద్ర వేసిన ఆయన,ఇప్పుడు సింహాద్రి నాథుని సేవకుడిగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

బాధ్యతలు స్వీకరించిన వెంకట్రావు NPN న్యూస్ మీడియాతో మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న పాదాల చెంత సేవ చేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం.స్వామివారి అనుగ్రహంతో,భక్తులందరికీ త్వరితగతిన దర్శనం కలిగేలా,వసతి మరియు ప్రసాద వితరణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు విశాఖపట్నం (సింహాచలం)

​ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా జె. వెంకటరావు అత్యంత భక్తిశ్రద్ధలతో బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటివరకు ఇంచార్జ్ ఈఓగా వ్యవహరించిన శ్రీమతి ఎన్.సుజాత నూతన ఈఓ కి అధికారికంగా బాధ్యతలను అప్పగించారు.

తొలుత తన సతీమణితో కలిసి ఆలయానికి చేరుకున్న వెంకటరావు దేవస్థానం అర్చకులు,అధికారులు నాదస్వర వేద మంత్రాల నడుమ సాదర స్వాగతం పలికారు.అనంతరం వారు ధ్వజస్తంభానికి మొక్కుకుని,గర్భాలయంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.అర్చకులు వారికి స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శింపజేసి,ప్రత్యేక పూజలు నిర్వహించారు.

92 జంటలతో వైభవంగా'స్వాతి హోమం' స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన స్వాతి హోమంలో నూతన ఈఓ దంపతులు పాల్గొన్నారు.లోక కల్యాణార్థం,క్షేత్రాభివృద్ధి కోసం జరిగిన ఈ హోమంలో 92 మంది భక్త జంటలు పాల్గొని స్వామివారికి ఆహుతులు సమర్పించారు.హోమ గుండం నుండి వెలువడిన ఆధ్యాత్మిక ప్రకంపనల మధ్య,వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. హోమానంతరం పండితులు ఈఓ దంపతులకు ఆశీర్వచనం అందించి,తీర్థ ప్రసాదాలు,శేష వస్త్రాన్ని బహూకరించారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస వాస్తవ్యులైన జె.వెంకటరావు 1995 నుండి రెవెన్యూ రంగంలో విశేష సేవలు అందించారు. తహశీల్దార్ నుండి డిప్యూటీ కలెక్టర్ వరకు,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన, క్రమశిక్షణ కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారిగా తనదైన ముద్ర వేసిన ఆయన,ఇప్పుడు సింహాద్రి నాథుని సేవకుడిగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

బాధ్యతలు స్వీకరించిన వెంకట్రావు NPN న్యూస్ మీడియాతో మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న పాదాల చెంత సేవ చేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం.స్వామివారి అనుగ్రహంతో,భక్తులందరికీ త్వరితగతిన దర్శనం కలిగేలా,వసతి మరియు ప్రసాద వితరణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటాం.దేవస్థాన పవిత్రతను కాపాడుతూ, పారదర్శకమైన పాలనతో క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు.
​ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు,సిబ్బంది మరియు భక్తులు పాల్గొని నూతన ఈఓ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
​తీసుకుంటాం.దేవస్థాన పవిత్రతను కాపాడుతూ, పారదర్శకమైన పాలనతో క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు.
​ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు,సిబ్బంది మరియు భక్తులు పాల్గొని నూతన ఈఓ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

3
123 views

Comment