logo

పదవ తరగతి విద్యార్థులకు 'ప్రజ్ఞా వికాసం': ఎస్ఎఫ్ఐ (ఎస్ఎఫ్ఐ ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ప్రతిభా పరీక్ష!



భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తోటపాలెంలో ఉన్న ఎఐఎం స్కూల్ లో 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పరీక్ష నిర్వహించడం జరిగింది. పరీక్ష పత్రాన్ని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ ఆర్.వి.ఆర్.కె చౌదరి మరియు ఎఐఎం స్కూల్ ప్రిన్సిపాల్ బాలాజీ ఓపెన్ చేయడం జరిగింది.
​ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలో 4000 మందికి పైగా రాస్తున్నారన్నారు. ఎస్ఎఫ్ఐ ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల్లో ఉన్న పరీక్షల భయాన్ని పోగొట్టి, వారిలో ఉన్న ప్రతిభను గుర్తించడానికి పెడుతున్నామన్నారు. భవిష్యత్తులో పాలిటెక్నికల్ ఏపీఆర్జేసీ రాసే విద్యార్థులకు ఈ పరీక్ష ఒక ప్రాక్టీస్ పరీక్షగా ఉంటుందన్నారు. ఈ పరీక్షలో పాల్గొన్న విద్యార్థుల్లో జిల్లాస్థాయిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5000, సెకండ్ వచ్చిన వాళ్ళకి 3000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 2000 ప్రైజ్ మనీ తో పాటుగా మెమొంటోస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆటలు, సినిమాలు, ఆన్లైన్ గేమ్స్, మొబైల్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ ప్రణాళికా బద్ధంగా చదివి మంచి మార్కులు సంపాదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ, రూప, సూరిబాబు, జయ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

5
257 views