దుప్పాడ శ్రీక్షేత్రంలో వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి వ్రతం: దశమ వార్షికోత్సవాల్లో వెల్లివిరిసిన భక్తిభావం
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దుప్పాడ శ్రీక్షేత్రంలో దశమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
అందులో భాగంగా ఆదివారం లక్ష్మి నరసింహ స్వామి వ్రతం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మీనరసింహాచార్య ఆధ్వర్యంలో వేద పండితులు భక్తులచే శాస్తోక్తంగా వ్రతం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దుర్గా, బాలాజీ దంపతులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.