logo

అమెరికా 'ప్రెసిడెంట్' అవార్డు గ్రహీత మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ఘన సత్కారం: విజయనగరంలో హోటల్ అసోసియేషన్ సంబరాలు.



ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఇండియా ఎస్ఎంఎస్ కౌన్సిల్ అందించే 'ద ప్రెసిడెంట్ వాలంటీర్స్ సర్వీస్ ' అవార్డును అందుకున్న రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను జిల్లా హోటల్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయం విజయనగరంలో ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మారుతి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మయూర బాబురావు, జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాళ్ళ సునీల్,రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు అనిల్,నవీన్ చేతుల మీదగా మంత్రికి సాలువ కప్పి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రితో కొద్దిసేపు మాట్లాడి అసోసియేషన్ సభ్యులంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గిరిబాబు, ఉదయ్, ఈశ్వర్, భాస్కర్ రావు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

34
6506 views