logo

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం.

నంద్యాల (AIMA MEDIA): ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు నంద్యాల పోలీసులు వాహానాల డ్రైవర్లకు “స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సులు, ఇన్స్యూరెన్స్ వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు.నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ,ఆత్మకూరు, నంద్యాల, డోన్ సబ్ డివిజన్ లలోని నేషనల్ హైవేల లో లారీలు, ప్రవేట్ ట్రావెలింగ్ బస్సులు, ఆర్టీసి బస్సులు , కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలేరో వాహనాలను పోలీసులు ఆపి ఆ డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు.వాహనాలను అతి వేగంతో నడపకూడదని, రాంగ్ రూట్ లో వెళ్ళకూడదని, పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోకూడదనిన పోలీసు అధికారులు ఆయా వాహనాల డ్రైవర్లకు తెలియజేస్తున్నారు.

3
822 views