logo

చంద్రబాబు ఆరోపణలు అవాస్తవం: భక్తులకు క్షమాపణ చెప్పాలి - మజ్జి శ్రీనివాసరావు విజయ



తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యవహరించారని విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మండిపడ్డారు. ఆదివారం ధర్మపురిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన పేర్కొన్న ముఖ్యాంశాలు:
* నిజం గెలిచింది: తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు లేదా పందికొవ్వు లేదని దేశంలోనే అత్యున్నత ల్యాబులైన జాతీయ పాడి పరిశోధనా సంస్థ మరియు జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు తేల్చిచెప్పాయి. ఈ నివేదికలతో కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను చంద్రబాబు ఎంతగా దెబ్బతీశారో స్పష్టమైంది.
* క్షమాపణ చెప్పాలి: పవిత్రమైన ప్రసాదంపై అపవిత్రపు మాటలు మాట్లాడి, భక్తుల భావోద్వేగాలతో ఆడుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.
* మాట మార్చడంలో సిద్ధహస్తుడు: ఏడాదిన్నరగా జంతువుల కొవ్వు అని ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అసలు విషయం తేలిపోవడంతో.. మాట మార్చి 'వేరే పదార్థాలు కలిపారు' అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిర్ధారణ లేకుండా ఇలాంటి సున్నితమైన అంశాలపై ఆరోపణలు చేయడం అపరాధం కాదా? అని ప్రశ్నించారు.
* దేవుడితో రాజకీయం తగదు: ఇప్పుడు మళ్ళీ లడ్డూ తయారీలో యాసిడ్స్ వాడారంటూ దేవుడంటే భయం, భక్తి లేకుండా మాట్లాడటం దారుణం. రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీ వేంకటేశ్వర స్వామిని, లడ్డూ ప్రసాదాన్ని వాడుకోవడం క్షమించరాని నేరం. విశ్వాసం అనేది రాజకీయ సాధనంగా మారకూడదని ఆయన హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో..
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కెవి సూర్యనారాయణ రాజు, నెక్కల నాయుడు బాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్ పాల్గొన్నారు.

7
234 views