అధికారి 'అధికార' దాహం.. అంగన్‌వాడీల్లో ఆకలి కేకలు!
అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న కొన్ని అంగన్వాడీ సెంటర్ లకు, అద్దెలు చెల్లించలేక, సిబ్బందికి జీతాలు లేక, తీవ్ర అవస్థలు పడుతున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలో ఉన్న అధికారి బదిలీపై వెళ్తూ అధికారాలు కూడా వెంటబెట్టుకుని వెళ్లిపోవడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది, ఏ జిల్లా అధికారి అయినా జిల్లా మారేటప్పుడు వేరొక చోటకి బదిలీ అయ్యేటప్పుడు తను నిర్వహిస్తున్న బాధ్యతలు వేరొకరికి అప్పజెప్పి, అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా కిందిస్థాయి సిబ్బందికి ఎటువంటి ఆటంకం కలగకుండా బాధ్యతలు వేరొకరికి అప్పజెప్పడం జరుగుతుంది, కానీ ఇక్కడ అధికారి తను నిర్వహిస్తున్న బాధ్యతలు పై కాస్త మమకారం పెంచుకోవడం, మళ్ళీ తొందరలోనే ఇక్కడికు వచ్చేయచ్చు అనే నమ్మకంతో, తనకున్న పెన్ పవర్ ని కూడా వెంటబెట్టు వెళ్ళడంతో, అంగన్వాడీ కార్యకర్తలు కి జీతాలు లేక అంగన్వాడీ సెంటర్ లు అద్దెలు చెల్లించక అంగన్వాడీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఐసీడీఎస్ లో కొంతమంది సిబ్బంది బహిరంగంగానే బాధని వ్యక్తం చేస్తున్నారు.