మర్రి నరేష్ ప్రధాన వార్త : జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్, వర్గ పోరు కార్యకర్తల ఇబ్బంది, ప్రజలు రాజకీయ విశ్లేషణ
రాయికల్ మున్సిపల్ ఎలక్షన్స్ గురించి చర్చించే ముందు ముఖ్యంగా స్థానిక రాజకీయం గురించి పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రజలు ఏ విధంగా చర్చించుకుంటున్నారు అనే అంశాన్ని ముందుగా ప్రస్తావిస్తే జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి వర్గాల మధ్య రాజకీయ పోరు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర స్థాయికి చేరుకుంది దీనికి సంబంధించిముఖ్యమైన తాజా పరిణామాలుగతంలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బరిలో సంజయ్ కుమార్ పోటీ చేయగా కల్వకుంట్ల కవిత సంజయ్ కుమార్ పక్షాన గట్టి ప్రచారం చేసి సంజయ్ కుమార్ గెలుపుకు కారణమైంది తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ లో కల్వకుంట్ల కవిత పోటీ చేయగా కవిత వల్ల ఓటమికి పాలైన జీవన్ రెడ్డి ఎంపీకి కవితను గెలవనివద్దని అంతర్గతంగా సొంత పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా వేరే ఇతర పార్టీలో ఉన్న అభ్యర్థికి ప్రచారం చేసి గెలిపించినట్లు...? అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా జీవన్ రెడ్డి పోటీ చేసిన ఈ మూడు పోటీలలో ఓటమిపాలవడం పార్టీ అధిష్టానం ఇవన్నీ అంతర్గత చర్చలో భాగంగా ఒక విధంగా జీవన్ రెడ్డిని పూర్తిస్థాయిలో పక్కన పెట్టకుండా...? పక్కన పెట్టినట్లే....? అనే వాదనలు వినిపిస్తున్నాయి ఇక ఇప్పటి విషయానికొస్తే ప్రస్తుతం కీలకంగా మారిన సంజయ్ కుమార్ ఫిరాయింపు కేసులో క్లీన్ చిట్సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారారంటూ దాఖలైన అనర్హత పిటిషన్‌ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కొట్టివేశారు సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినట్లు సరైన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు జీవన్ రెడ్డి రియాక్షన్ స్పీకర్ నిర్ణయాన్ని జీవన్ రెడ్డి స్వాగతించారు సంజయ్ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి ఆయన తన కార్యకలాపాలను బీఆర్ఎస్‌కే పరిమితం చేసుకోవాలి కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు" అని ఆయన ఘాటుగా స్పందించారు ఇదంతా ఒకపక్క జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బి ఫామ్ లు రాయికల్ మున్సిపల్ అభ్యర్థి బరిలో ఉన్న వారికి జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా తన సొంత వర్గమైన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి బీ పాములు ఇచ్చుకున్నారు ఇక ప్రజలలో రాజకీయ విశ్లేషకుల చర్చలు ప్రజల వాదనలు పలు రకాలుగా వినిపిస్తున్నాయి ప్రధానమైన వాదనలు ఇప్పుడు చూద్దాంఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికలో ఇరు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి కాంగ్రెస్ జెండా మోసిన పాత కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలని జీవన్ రెడ్డి పట్టుబడుతుండగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన వర్గానికి ప్రాధాన్యత కోరుతున్నారుబహిరంగ విమర్శలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తే స్వాగతిస్తాం కానీ కాంగ్రెస్ పార్టీని తొక్కుతానంటే చూస్తూ ఊరుకోం అని జీవన్ రెడ్డి ఇటీవల బహిరంగ సభల్లో హెచ్చరించారు మరోవైపు సంజయ్ కుమార్ తాను ప్రభుత్వ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నానని చెబుతున్నారురాజకీయ విశ్లేషణజగిత్యాల రాజకీయాల్లో ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ పోరు కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది వాదనలతో పాటు పాత కాంగ్రెస్ శ్రేణులు జీవన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం మధ్య సమన్వయం కుదరకపోవడం వల్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉందిప్రజల నుంచి వ్యక్తమవుతున్న ప్రధానాభిప్రాయాలుఅభివృద్ధి కుంటుపడుతుందనే ఆందోళన ఇద్దరు అగ్ర నేతల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల నియోజకవర్గంలో ఇటు రాయికల్ మున్సిపల్ లో అభివృద్ధి పనులు నిధుల మంజూరులో జాప్యం జరుగుతుందని సామాన్య ప్రజలు భావిస్తున్నారు ఎవరికి విన్నవించుకుంటే పని జరుగుతుందోప్రభుత్వ పథకాల అమలు ఒక వర్గం వారు ఎమ్మెల్యే ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంటే పాత కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్సీ సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని అంటునారు దీనివల్ల అర్హులైన సామాన్యులకు ప్రభుత్వ ఫలాలు అందడంలో రాజకీయం అడ్డుపడుతోందని విమర్శలు వస్తున్నాయిమున్సిపల్ ఎన్నికల ప్రభావంప్రజలు ఈ వర్గపోరును నిశితంగా గమనిస్తున్నారు అభ్యర్థి ఎవరనే దానికంటే గెలిచిన తర్వాత ఏ వర్గంలో ఉంటారు...? అనే చర్చ ఓటర్లలో నడుస్తోందికార్యకర్తల ఆవేదనక్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు రెండు వర్గాలతో ఇబ్బంది పడుతున్నారు ఏ ఒక్క నాయకుడి వైపు నిలబడ్డా మరో నాయకుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారుఇరు వర్గాల మధ్య రాయికల్ మున్సిపల్ లో పై చేయి ఎవరిది...? అనే రేపటి ప్రధాన వార్త లో