
ఎస్సీ కమిషన్ మెంబర్ సభ్యులు రావాడ సీతారాం రాజాంలో పర్యటన
విజయనగరం జిల్లా. రాజాం.
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యులు రావాడ సీతారాం శనివారం రాజాం మండలం పరిధిలోని సోపేరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో పర్యటించి స్థానిక దళితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయంపై అక్కడి ప్రజలతో మాట్లాడారు.
ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి డిప్యూటీ ఎంపీడీవో వి. శ్రీనివాసరావు కమిషన్ సభ్యులకు వివరించారు. పలు అంశాలపై ఆయన అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం.
అనంతరం రాజాం పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఏఎంసీ చైర్మన్ రేగిన సింహాచలం, డిప్యూటీ ఎంపీడీవో వావిలపల్లి శ్రీనివాసరావు, పాండ్రంకి శ్రీనివాసరావు, దెబారిక రామప్పుడు, తీగల మోహన్, ఎస్సీ అసోసియేషన్ వెల్ఫేర్ అధ్యక్షులు ధర్మాన కృష్ణ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు.