logo

పెరటి కోళ్ల పెంపకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

పెరటి కోళ్ల పెంపకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్


లక్ష్మీదేవి పల్లి ఫిబ్రవరి 7 ():పెరటి కోళ్ల పెంపకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయ సమాకూరుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీలో గ్రామీణ కుటుంబాల జీవనోపాధి స్థాయి మెరుగుదల లక్ష్యంగా నిర్వహించిన పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెరటి కోళ్ల పెంపకం ద్వారా కుటుంబ అవసరాలకు సరిపడా ఆదాయం లభించడంతో పాటు పోషక విలువలు గల ఆహారం కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. లబ్ధిదారులు కోళ్లను శ్రద్ధతో, సరైన సంరక్షణతో పెంచుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 50 యూనిట్లను గాను, 50 మంది మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20 చొప్పున కోడి పిల్లలను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రతి లబ్ధిదారులకి 10 కిలోల కోళ్ల దాణా తో పాటు అవసరమైన ఫీడర్లు కూడా అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పెరటి కోళ్ల పెంపకంలో పాటించాల్సిన ప్రాథమిక అంశాలు, కోళ్లకు అందించాల్సిన ఆహారం, నివాస ఏర్పాట్లు, వ్యాధుల నివారణ, టీకాల నిర్వహణ తదితర అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.ఎన్‌ఎంఆర్‌ఐ, హైదరాబాద్‌కు చెందిన సీనియర్ సైంటిస్ట్ డా. యోగేష్ దడేకర్ మాట్లాడుతూ పెరటి కోళ్ల పెంపకం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుందని వివరించారు. ఐడీఓ గట్టుమల్ల డా. కపిల్ శర్మ పెరటి కోళ్ల పెంపకాన్ని దీర్ఘకాలిక జీవనోపాధిగా అభివృద్ధి చేసుకునే విధానాలపై విలువైన సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో రామవరం పశు వైద్యులు డాక్టర్ ఆనందరావు, సంబంధిత శాఖల అధికారులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గ్రామస్తులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

9
1154 views