logo

ప్రముఖ డేటా సైన్స్ సంస్థ డాటావ్యాలీ తో అవగాహన ఒప్పందం: ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం.

పాణ్యం (AIMA MEDIA): శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి), నంద్యాల మరియు ప్రముఖ డేటా సైన్స్ సంస్థ డాటావ్యాలీ (DataValley) మధ్య జనవరి 30వతేది అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది అని పేర్కొన్న ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం.ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు, రియల్‌టైమ్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీ ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్‌లు మరియు కెరీర్ మార్గదర్శకత్వం అందించనున్నారు అని తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, అకడమిక్ విద్యతో పాటు పరిశ్రమ అనుభవం కలిసినప్పుడే విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటారని తెలిపారు. ఈ MoU ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరిగి, ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగవుతాయని ఆయన అన్నారు.కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్) విభాగాధిపతి డా. ఎన్. రమాదేవి మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో విద్యార్థులకు నిరంతర శిక్షణ మరియు పరిశ్రమతో నేరుగా అనుసంధానం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం మరియు ఇన్నోవేషన్‌ను పెంపొందించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.
ఈ అవగాహన ఒప్పందం ద్వారా సంయుక్త వర్క్‌షాప్‌లు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పరిశ్రమ–విద్యా సంస్థల మధ్య సహకారం మరింత బలోపేతం కానుందని కళాశాల యాజమాన్యం వెల్లడించింది.

5
841 views