logo

శ్రీశైలం పోయే యాత్రికులకు త్రాగునిరు తినుబండారాలు సరఫరా........

శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శివ భక్తులు అటవీ ప్రాంతం గుండా ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఆహారం నీరు లభించని కీకారణ్యంలో శివ భక్తులను ఉద్దేశించి ఏటా లక్షలాది మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలుగా ఈ అన్న ప్రసాద వితరణ మహాయజ్ఞ కార్యక్రమాన్ని దిగ్భజంగా పూర్తి చేస్తూ మరో మారు శివభక్తులకు సేవ చేసే అదృష్టం లభించిందని ఈ సందర్భంగా మీడియాకు వివరాలు వెల్లడించారు. వెంకటాపురం నుండి శ్రీశైలం దర్శనానికి వెళ్లే శివ భక్తులకు గత ఐదు సంవత్సరాలుగా ఇస్కాన్ సంస్థ సహకారము, నందన ఎంటర్ప్రైజెస్, ఎస్ ఆర్ ఎమ్ బిల్డర్స్ సంయుక్తంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. కాలినడకన సుమారు 56 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్న భక్తులకు అనంతపురం లోని నందన ఎంటర్ ప్రైజస్ అధినేత కె.వి నారపరెడ్డి, ఎస్ఆర్ఎం బిల్డర్స్ శివారెడ్డి, హరి, నరసింహారెడ్డి, మనోజ్, దేవ నరేష్, లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో గడిచిన ఐదు సంవత్సరాలుగా లక్షలాది మందికి అన్నదానం చేసిన అదృష్టం తమ లభించిందని నిర్వాహకులు వెల్లడించారు.

2
13 views