logo

సిపిఎం పార్టీ బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ 56 వ డివిజన్ అభ్యర్థిని బాలిశెట్టి సత్యభామ విజయం ముమ్మాటికి ఖాయం

సిపిఎం పార్టీ బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ 56 వ డివిజన్ అభ్యర్థిని బాలిశెట్టి సత్యభామ విజయం ముమ్మాటికి ఖాయం

*కార్పొరేషన్ ఎన్నికల్లో 56 డివిజన్ అభ్యర్థిని కి మహిళల సంపూర్ణ మద్దతు,

*మైనార్టీలు సైతం బాలిశెట్టి సత్యభామ కి మా ఓటు అంటున్న మైనార్టీలు,

కొత్తగూడెం ప్రప్రధమంగా కార్పొరేషన్ గా రూపాంతరం చెందిన మొట్టమొదటి కార్పొరేషన్ ఎన్నికల్లో 56 వ డివిజన్ నుండి
సిపిఎం పార్టీ బలపరుస్తున్న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా బాలిశెట్టి సత్యభామ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం ముంగిట్లో ఇప్పటికే నిలిచారు గతంలో రెండు సార్లు మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచి అనేక అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించి వారి ఆధర అభిమానాలు పొందిన నాయకురాలిగా బాలిసెట్టి సత్యభామ దంపతులు నిరుపేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయే విధంగా ముఖ్యంగా అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇండ్లు లేని వారందరికీ ఇందిరమ్మ గృహాలు, ఆడపిల్లల పెళ్ళిళ్ళకి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లు పథకాలను మంజూరు చేయించి నిరుపేదల కలలను సాకారం చేసిన ఘనత బాలిశెట్టి దంపతులకు చెందుతుందని వీరు సేవా కార్యక్రమాల్లో ఇతోదిక సాహయ సహకారాలు అందించిన వారీగా 56వ డివిజన్ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారూ.
వీరు ఇప్పుడు కూడా నూతనంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం భవిష్యత్తులో చేయదలచిన పనులను సైతం ముందే మ్యానిఫెస్టో ద్వారా ప్రకటించడం వీరి చిత్తశుద్ధికి గీటు రాయిగా నిలవడం ఖాయం వీటిలో ప్రధానమైనవి సొంత నిధులతో నిర్మిస్తున్న ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభిస్తామని, మిగిలి ఉన్న డ్రైన్లు మరియు రోడ్లు పూర్తి చేస్తామని, పిల్లలకు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయిస్తామని, అదేవిధంగా పిల్లలకు క్రీడా స్థలం ఏర్పాటు చేస్తామని, గ్రంథాలయం ఏర్పాటు, అదేవిధంగా పరిశుభ్రతకు మారుపేరుగా మన 56 డివిజన్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మాట ఇస్తున్నామని .ప్రతి ఆరు నెలలకు ఉచిత మెడికల్ క్యాంపు అర్హులైన అందరికీ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు అమలు జరిగేలా చేస్తామని అదేవిధంగా మహిళలకు పలు రంగాలలో ఉచిత శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తామని అన్నారు. వీరి చిత్తశుద్ధికి నిబద్ధతకు 56 వ డివిజన్ ప్రజలు బాలిశెట్టి సత్యభామను అత్యధిక మెజార్టీతో గెలిపించు కుంటామని గంటాపదంగా తెలుపుతున్నారు

141
5444 views