logo

కార్పొరేషన్ లో కారు స్పీడ్ పెంచిన ఎంపీ వద్దిరాజు ఎంపీ వద్దిరాజు కార్పొరేషన్bలో విస్తృతగా ప్రచారం

కార్పొరేషన్ లో కారు స్పీడ్ పెంచిన ఎంపీ వద్దిరాజు

ఎంపీ వద్దిరాజు కార్పొరేషన్bలో విస్తృతగా ప్రచారం

బిఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

వివిధ డివిజన్ లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు

కొత్తగూడెం ఫిబ్రవరి 6 :కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్, అశ్వారావుపేట పట్టణంలో విస్తృత ప్రచారం చేశారు.ఎంపీ రవిచంద్ర శుక్రవారం ఉదయం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుతో కలిసి మొదట కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్ సుజాతానగర్,ఆ తర్వాత 60వ డివిజన్ కూలీలైన్,55వ డివిజన్ గణేష్ టెంపుల్ ఏరియా,58వ డివిజన్ హనుమాన్ బస్తీలలో ప్రచారం నిర్వహించారు.అటుతర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మునిసిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి కాలినడకన పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఘన విజయం చేకూర్చాల్సిందిగా మండుటెండలో సుమారు రెండున్నర గంటల పాటు ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేశారు.ఎంపీ రవిచంద్ర శుక్రవారం సాయంత్రం తిరిగి కొత్తగూడెం చేరుకుని ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీలతో కలిసి 57,56వ డివిజన్లలో,59 వ డివిజన్ కూలీలైన్ క్లబ్ ఏరియాలో ఎన్నికల ప్రచారం జరిపారు.ఈ సందర్భాలలో వందలాది మంది స్థానికులు హాజరై జై తెలంగాణ జైజై తెలంగాణ జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్ వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి కారు గుర్తుకే మన ఓటు గెలిపిద్దాం గెలిపిద్దాం కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిద్దాం అనే నినాదాలు హోరెత్తాయి. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల టిఆర్ఎస్ అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

24
217 views