logo

కాంగ్రెస్ అభ్యర్థి ని గెలిపిస్తే ఒక్కో వార్డుకు 8 కోట్ల రూపాయల తో అభివృద్ధి..

సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో జయా చైతన్య రెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి..
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతున్నారు. ఒక వైపు జగ్గారెడ్డి అభ్యర్థులకు, నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చెస్తూ మరో వైపు జగ్గారెడ్డి కూతురు యూత్ కాంగ్రెస్ జెనరల్ సెక్రటరీ జయా రెడ్డి ఇంటిటి ప్రచారం తో సంగారెడ్డి పట్టణాన్ని చుట్టేస్తున్నారు. ఇంకోవైపు డిసిసి అధ్యక్షురాలు, TGIIC చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఉదయం నుండి రాత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నారు. జయా చైతన్య రెడ్డి శుక్రవారం సంగారెడ్డి పట్టణం లో ని 1,2,3 వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.ఇంటిటికి వెళ్లి అందరినీ పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈసందర్భంగా జయా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, మీ గల్లీ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. జగ్గారెడ్డి లాంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటారని, అంతటి నాయకుడు మీకు అండగా ఉన్నాడని, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి ఆదరించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పట్టణం లో 17 వ వార్డు తో పాటు సదాశివపేట పట్టణం లోని ఒకటవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రానున్న మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని సూచించారు.

24
624 views