logo

ఘనంగా శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో న్యూరోస్పార్క్–2K26 కార్యక్రమం.

పాణ్యం (AIMA MEDIA ): పాణ్యం మండలం శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల (ఆటోనమస్)లో న్యూరోస్పార్క్–2K26 కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6, 2026న విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐడియాథాన్, హ్యాకథాన్ మరియు స్టార్టప్ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. “ఇగ్నైట్ ది పవర్ ఆఫ్ యువర్ బ్రెయిన్” అనే నినాదంతో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీ.టెక్, ఎం.టెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.న్యూరోస్పార్క్–2K26లో ఏఐ ఆధారిత గ్లోబల్ సమస్యల పరిష్కారాలు, అగ్రిటెక్ & గ్రామీణ ఆవిష్కరణలు, హెల్త్‌టెక్ & బయో ఇన్నోవేషన్, స్మార్ట్ సిటీస్, క్లిన్ ఎనర్జీ & సస్టెయినబిలిటీ, ఎడ్‌టెక్ & స్కిల్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ & ఎంబెడెడ్ సిస్టమ్స్, సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీ వంటి అంశాలపై విద్యార్థులు తమ ఆలోచనలను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు.న్యూరోస్పార్క్ కోఆర్డినేటర్‌గా డా. ఎన్. ప్రవీణ్ కుమార్, స్టార్టప్ కోఆర్డినేటర్‌గా డా. కె. రాజ్ కుమార్ సమర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

0
0 views