logo

రాహుల్ మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయ్యిందంటే........

ఈరోజు పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలు బీజేపీ కోటను కదిలించాయి. రాహుల్ మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయ్యిందంటే...

అమిత్ షా, రాజనాథ్ సింగ్, కిరణ్ రిజిజు వంటి కీలక మంత్రులు పదే పదే అడ్డుతగిలారు. చివరకు ఆయన గొంతు నొక్కే ప్రయత్నంలో స్పీకర్ ఓం బిర్లా మైక్ కూడా కట్ చేశారు.

మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన కథనాన్ని ఆధారంగా చేసుకుని రాహుల్ విరుచుకుపడ్డారు. "మీరు చెప్పేది ప్రామాణికమేనా అని స్పీకర్ ప్రశ్నించగా, "నా మాటలు 100% సత్యం..

దమ్ముంటే కాదని నిరూపించండి" అన్నట్లుగా రాహుల్ దీటైన సమాధానం ఇచ్చారు.❤️👌

బీజేపీ ఎందుకు భయపడుతోంది? ప్రధాన కారణాలివే
సైనిక రహస్యాలు - వైఫల్యాలు: డొక్లామ్ విషయంలో చైనా ఆక్రమణలు, భారత భూభాగంపై జరుగుతున్న పరిణామాల గురించి మాజీ ఆర్మీ చీఫ్ తన పుస్తకంలో వాస్తవాలు రాశారు. ఆ నిజాలు బయటపడితే, బీజేపీ చెబుతున్న "బలమైన దేశ రక్షణ" అనే వాదన గాలిలో కలిసిపోతుందని భయం.

పుస్తకంపై సెన్సార్‌షిప్: దేశం గర్వించే ఒక మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకాన్ని రాకుండా అడ్డుకుంటున్నారంటేనే, అందులో ప్రభుత్వం దాస్తున్న 'పెద్ద నిజం' ఏదో ఉందని స్పష్టమవుతోంది. ఈ 'పుస్తకం బ్యాన్' అంశాన్ని రాహుల్ ఎండగట్టడం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు.

సరిహద్దు భద్రతపై ప్రశ్నలు: దేశ భక్తి గురించి మాట్లాడే బీజేపీ, సరిహద్దుల్లో చైనా ఆగడాలను అడ్డుకోవడంలో విఫలమైందనే ముద్ర పడకూడదని ఆరాటపడుతోంది. రాహుల్ నేరుగా డొక్లామ్ ప్రస్తావన తేవడంతో మోదీ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది.

సత్యాన్ని ఎదుర్కోలేక: నరవణే పుస్తకంలో ఉన్నది పచ్చి నిజమని బీజేపీకి తెలుసు. అందుకే చర్చను దారి మళ్లించడానికి మంత్రులందరూ ఏకమై రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

చివరకు మూడు సార్లు సభ వాయిదా వేశారు రాహుల్ గాంధిని మాట్లాడనివ్వకుండా మైక్ కట్ చేశారు కాని రాహుల్ గాంధి వెనక్కి తగ్గలేదు వెనక్కి తగ్గాల్సిన అవసరం కూడా లేదు
జై హింద్..........

0
100 views