logo

సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల కోసం ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలి*



*సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల కోసం ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలి*

- *: జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్*

- *శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల కోసం ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలపై సంబంధిత శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.*

- *ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 13, 14, 15వ తేదీలలో గుత్తి మండలం సేవాగఢ్ లో నిర్వహించే శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను సజావుగా నిర్వహించాలన్నారు. వేడుకల కోసం పోలీస్ వారు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్, బ్యారికేడ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ నుంచి బస్సులు ఏర్పాటు చేయాలని, గుత్తి - గుంతకల్లు మధ్యలో సేవాగఢ్ వద్ద స్టాపింగ్ ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు బస్సులను కేటాయించాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో సేవాలాల్ కు వెళ్లే రోడ్ లో జంగిల్ క్లియరెన్స్ చేయాలని, గుంతలు పూడ్చాలని, పార్కింగ్ ప్రాంతాలను శుభ్రం చేయాలని, అవసరమైనచోట బ్యారికేడింగ్ చేయాలని, శానిటేషన్ జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ఎస్పిడిసిఎల్ ఆధ్వర్యంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, ఆర్డబ్ల్యుఎస్ శాఖ నుంచి తాగునీటిని అందుబాటులో ఉంచాలని, టాయ్ లెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ పాటిస్తూ స్టాల్ ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ నుంచి మూడు రోజులపాటు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని, 104, 108 వాహనాలను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని శాఖల అధికారులతో డిటిడబ్ల్యుఓ సమన్వయం చేసుకోవాలని, జయంతి వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు.*

- *ఈ సమావేశంలో గుంతకల్లు ఆర్డీఓ ఏబీవీఎస్బి శ్రీనివాస్, గుంతకల్లు డిఎస్పీ శ్రీనివాస్, డిటిడబ్ల్యుఓ శ్రీనివాసరావు, శ్రీ సేవాలాల్ మహరాజ్ ట్రస్ట్ అధ్యక్షుడు కేశవనాయక్, ట్రస్ట్ నుంచి అశ్వత్థనాయక్, బాలానాయక్, డీఎల్డిఓ విజయలక్ష్మి, ఆర్డబ్ల్యుఎస్ ఈఈ శ్రీనివాసులు, ఆర్.అండ్.బి డిఈఈ సత్యనారాయణ, గుత్తి, గుంతకల్లు తహసీల్దార్లు పుణ్యవతి, రమాదేవి, జిల్లా టూరిజం అధికారి జయకుమార్ బాబు, ఆర్అండ్బి ఎస్ఈ మురళీకృష్ణ, ఏపీఎస్ఆర్టీసీ డిఎం ఖాజావలి, గుత్తి పిఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామారావు, ఎంపీడీవో ప్రభాకర్, పీఆర్ ఏఈఈ మల్లేష్ నాయక్, ఎస్పిడిసిఎల్ డిఈ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.*

0
88 views