logo

*ప్రజలందరు వాతావరణ కాలుష్యం పై, ఆరోగ్యం, పై అవగాహణ కలిగి ఉండాలి*....

డోన్ కె వి ఎస్ హాస్పిటల్ నందు వైద్యశాలకు వచ్చిన ప్రజలకు *పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై అవగాహణ*
*ప్రజలందరు వాతావరణ కాలుష్యం పై, ఆరోగ్యం, పై అవగాహణ కలిగి ఉండాలి*
*ప్రతి ఒక్కరు మొక్కలు నాటి మహావృక్షాలుగా చేసి, ప్లాస్టిక్ ని వాడకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి*
*కృత్రిమంగా ఆక్సిజన్ ను కనుగొన్న శాస్త్రవేత్త శ్రీ జోసెఫ్ ప్రీస్ట్ లీ సేవలు చిరస్మరణీయం*
*సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి*
*డోన్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఇ .శ్రీధర్, డాక్టర్ ఇ. దీపిక*
*ఫిబ్రవరి 6 న కృత్రిమంగా ఆక్సిజన్ ను కనుగొన్న శాస్త్రవేత్త శ్రీ జోసెఫ్ ప్రీస్ట్ లీ వర్థంతి సందర్భంగా*
డోన్ పట్టణంలోని డోన్ కె వి ఎస్ హాస్పిటల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆద్వర్యంలో కె వి ఎస్ హాస్పిటల్ అధినేత డోన్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఇ .శ్రీధర్, డాక్టర్ ఈ. దీపిక అద్యక్షతన కృత్రిమంగా ఆక్సిజన్ ను కనుగొన్న శాస్త్రవేత్త శ్రీ జోసెఫ్ ప్రీస్ట్ లీ వర్థంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డోన్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఇ .శ్రీధర్, డాక్టర్ ఇ.దీపిక, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లడుతూ
*మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి డాక్టర్ ఇ .శ్రీధర్, డాక్టర్ ఇ.దీపిక పేర్కొన్నారు*
జోసెఫ్ ప్రీస్ట్‌లీ మార్చి 13, 1733 జన్మించారు. వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్న శాస్ర్తవేత్త. కార్బన్‌ డయాక్సైడును కృత్రిమంfnfగా చేయడాన్ని కనిపెట్టింది కూడా ఈయనే. ఇవే కాదు కార్బన్‌ మోనాక్సైడు, నైట్రస్‌ ఆక్సైడు (లాఫింగ్‌ గ్యాస్‌) లను కూడా ఈయనే ఆవిష్కరించారు. ఇవన్నీ వేర్వేరు సందర్భాలలో ఎంతగానోఉపయోగపడుతున్నాయి.
ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజిమెన్ ఫ్రాంక్లిన్ ఇంగ్లండు పర్యటనతో స్ఫూర్తి పొంది విద్యుత్ పై అధ్యయనం చేసి 'హిస్టరీ అండ్ ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ' గ్రంథాన్ని రాశారు.అమెరికా నార్తంబర్లాండ్లో ఆయన ప్రయోగశాలలను నేషనల్ మ్యూజియంగా ప్రకటించారు. ఈయన ఫిబ్రవరి 6, 1804 స్వర్గస్తులైనారు. సమాజ సేవకులను శాస్త్రవేత్తలను ఎల్లవేళలా స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి, డాక్టర్ ఇ.శ్రీధర్, డాక్టర్ ఇ.దీపిక కోరారు.
*భ్రూణ హత్యలు నివారించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి*
పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టంపై వైద్యశాలకు వచ్చిన ప్రజలకు డోన్ కె వి ఎస్ హాస్పిటల్ అధినేత డోన్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ .డాక్టర్ ఇ .శ్రీధర్, డాక్టర్ ఈ .దీపిక సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి లు అవగాహణ కల్పించారు. వారు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో మన దేశం లో గణాంకాలు పరిశీలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతున్నది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు వల్ల దంపతులు మగపిల్లాడు పుడితే బాగుంటుందని భావించడం వల్ల ఆడపిల్లల భ్రూణ హత్యలు జరుగుతున్న కారణంగా ఇలాంటి హత్యలను నిలువరించేందుకు ప్రభుత్వం 1994లో పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పై పూర్తిస్థాయిలో అవగాహనతో అక్రమ లింగనిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై సమాచారం అందించడానికి సమాజంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఈ చట్ట అమలుకు సహకరించాలని డాక్టర్ ఇ.శ్రీధర్, డాక్టర్ ఈ.దీపిక, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు. అలాగే ప్రజలు ఆరోగ్యం,కాలుష్యం పై అవగాహణ కలిగి ఉండి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా దోమకాటు నుంచి వచ్చేవిష జ్వరాల నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. వాతావరణ కాలుష్యానికి హానికరమైన ప్లాస్టిక్ నిరోధించాలి. ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలి. విరివిగా మొక్కలు నాటి మహావృక్షాలుగా తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పరిరక్షణ - ఓజోన్ పొరను రక్షించుకోవాలని తెలిపారు. ,నీటిని వృధా చేయకుండ జల సంక్షోభాన్ని అరికట్టాలని, విద్యార్థులు అనవసరంగా స్మార్ట్‌ ఫోన్‌ ఎక్కువ వాడకుడదని తెలియజేశారు.ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులను సంప్రదించకుండా నొప్పులు మాత్రలు వాడరాదు.చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని,నీళ్ళు శరీరానికి తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి, డాక్టర్ ఇ. శ్రీధర్, డాక్టర్ ఇ.దీపిక తెలిపారు.

1
25 views