
పుట్టపర్తి నియోజవర్గం లో 5వేల వాట్స్ తో మెగా సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు...
పుట్టపర్తి నియోజవర్గం లో 5వేల వాట్స్ తో మెగా సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు
పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక చొరవతో ఆమడగూరు,ఓడి.చెరువు,నల్ల మాడ మండలాల్లోని 95 వేల ఎకరాల్లో
ఏర్పాటుకు ముందుకు వచ్చిన రిలయన్స్ కంపెనీ.స్థానికంగా 4500 మందికి ఉద్యోగ అవకాశాలు.ఆమడ గూరు మండలంలో పర్యటించిన పుట్టపర్తి ఎమ్మెల్యే,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు, పుట్టపర్తి నియోజకవర్గంలో 5వేల మెగావాట్స్ సోలార్ ఉత్పత్తి చేయడానికి ఎంతో అనుకూల ప్రాంతమైన పుట్టపర్తి నియోజవర్గంలో రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు చర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక చొరవతో ఆ దిశగా ఆ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం నియోజకవర్గంలోని అమడగూరు మండలంలో రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు ,ప్రభుత్వ అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి తోపాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పర్యటించి స్థానిక తహశీల్దార్లు ,ప్రజా ప్రతినిధులు,స్థానిక రైతులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ సత్యసాయి జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన అమడ గూరు అభివృద్ధికి కూడా నోచుకోలేదన్నారు. ఇలాంటి సమయంలో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు దృష్టికీ ప్రత్యేకంగా తీసుకెళ్ళడంతో ప్రభుత్వం స్పందించి పుట్టపర్తి నియోజకవర్గానికి ఈ అవకాశం ఇచ్చిందుకు నియోజవర్గ ప్రజల తరపున సీఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ కు ఎంఎల్ఏ పల్లె సింధూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోలార్ కు ఈ ప్రాంతం ఎంతో అనుకూలమన్నారు. ముందుగా ఆమడ గూరు మండలంలో 25వేల ఎకరాల్లో సుమారు 5వేల మెగా వాట్స్ సోలార్ ఉత్పత్తి చేయడానికి కంపెనీ రైతులతో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. ఏడాదికి ఒకొక్క రైతుకు ఎకరాకు రూ.30వేలు చొప్పున సోలార్ పవర్ ఉత్పత్తికి కంపెనీ చెల్లిస్తున్నారని ,రెండేళ్ల తర్వాత 5%చొప్పున పెంచుతూ 30 ఏళ్ల పాటు వీటికి కాలపరిమితి ఒప్పందం కుదుర్చుకోనీ రైతుల అంగీకారం తో ముందుకు పోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా ఓడి చెరువు, నల్లమాడ మండలాల్లో కూడా మరో 70వేల ఎకరాల్లో సోలార్ ఉత్పత్తి ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి రిలయన్స్ కంపెనీ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిందని తెలిపారు. రైతులకు ఎలాంటి నిర్ణయం జరగకుండా 30 వేల చొప్పున ఏడాదికి చెల్లించే విధంగా కంపెనీ అంగీకారం తెలిపిందని తెలిపారు. ఈ మూడు మండలాల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు అయితే సుమారు 4500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మరో రెండు వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రైతులు ఉదారంగా ముందుకొచ్చి సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు తగిన సహాయ సహకారాలు అందించి ఇందులో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి కోరారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సైన్సు సిటీ పేరుతో ఏపీ ఐ ఐ సి ద్వారా వేలాది ఎకరాల భూములు సేకరించి పరిశ్రమ రాకపోవడంతో ఆ భూములు నిరుపయోగంగా మారాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రిలయన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చిందని అందుకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైందని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి తో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు దృష్టికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తీసుకెళ్లడంతో కూటమి ప్రభుత్వం స్పందించి ఈ పరిశ్రమల ఏర్పాటుకు రిలయన్స్ కంపెనీ ప్రతినిధులను ఇక్కడికి పంపించిందని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో తులార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చిన రిలయన్స్ కంపెనీ యాజమాన్యానికి ,ప్రతినిధులకు ఈ ప్రాంత ప్రజల తరఫున రైతాంగం తరుపున ప్రభుత్వానికి మరియు సీఎంకు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలో సోలార్ ప్రాజెక్టులే కాకుండా మరిన్ని ఐటీ, ఇండస్ట్రియల్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమల హబ్బుగా మార్చేందుకు ఎమ్మెల్యే పద సింధూర రెడ్డి కృషి చేస్తారని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తె అనుకూలమైన భూములతో పాటు రైతుల అంగీకారంతో ముందుకు వెళ్లే విధంగా అన్ని విధాలుగా తగిన సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమడ గూరు మండల కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు సింగిల్ విండో అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ప్రసాద్ రెడ్డి , వల్లెపు సోమశేఖర్ , మార్కెట్ యార్డ్ పాలకవర్గ సభ్యులు నంజప్ప , నిజాం ,కంచి సురేష్,మాజీ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి , టీడీపీ నాయకులు కుమార్ రెడ్డి, రాజారెడ్డి ,బోడెప్ప,రామచంద్ర , రామకృష్ణ ,భాస్కర్ రెడ్డి, రమణారెడ్డి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.