logo

తొలిసారి జిల్లా కలెక్టర్ తో అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల సమావేశం.......

*అనంతపురం జిల్లాలో 551మంది తొలి విడుతలో అక్రిడిటేషన్లు**తొలిసారి జిల్లా కలెక్టర్ తోఅక్రిడిటేషన్కమిటీసభ్యులసమావేశం*దరఖాస్తు చేసుకున్న అందరికీ అక్రిడిటేషన్లు వస్తాయి*
*ఎవరూ ఆందోళన చెందవద్దు.. అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ రేపటి రామాంజినేయలు*
*మా ప్రతిపాదనలకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్న రామాంజినేయులు*
అనంతపురం జిల్లాలో తొలి విడుతలో 551 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరుకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆమోదం తెలిపారని అక్రిడిటేషన్ కమిటీ మెంబర్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకుడు రేపటి రామాంజనేయులు తెలిపారు. ఇవాళ అనంతపురం కలెక్టరేట్లో అక్రిడిటేషన్ కమిటీ మెంబర్లతో ఛైర్మన్ హోదాలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మొత్తం ఇప్పటివరకు 770 మంది వరకు జర్నలిస్టులు అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తు చేసుకోగా 551 మంది అర్హులుగా గుర్తించారు. వీటిని కలెక్టర్ వద్దకు పంపగా ఆయన కూడా ఆమోదముద్ర వేశారు. అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో 12మంది సభ్యులు పలు అంశాలను ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చిన్న పత్రికల విషయంలో కూడా దరఖాస్తు చేసుకున్న వారిని పరిశీలించాలని కోరారు. వీటన్నింటిపై సానుకూలంగా కలెక్టర్ స్పందించినట్లు కమిటీ మెంబర్ రేపటి రామాంజనేయులు తెలిపారు. ప్రతి టీవీ ఛానల్ కు పది వరకు అక్రిడిటేషన్లు మంజూరు చేసేందుకు కలెక్ట్ అంగీకరించారన్నారు. పెద్ద పత్రికలకు 52, మరికొన్ని పత్రికలు 40 వరకు అక్రిడిటేషన్లు వస్తాయన్నారు. తొలి సమావేశం మంచి వాతావరణంలో జరిగిందని.. తాము విజ్ఞప్తి చేసిన అన్ని అంశాలకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు, జిల్లాలో చాలామంది సీనియర్ జర్నలిస్టులు వివిధ పెద్ద పత్రికల్లో పనిచేసి.. ప్రస్తుతం సొంతంగా పత్రికలు నడుపుతున్నారన్నారు. ఇలాంటి వారికి అక్రిడిటేషన్లు ఇవ్వాలని కోరామన్నారు. దిన, వార, పక్ష, మాస పత్రికల వారికి 2+1, 1+1 ప్రకారం ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. సమాజం కోసం తమ సొంత డబ్బులతో కొంతమంది చిన్న పత్రికలు నడుపుతున్నారని.. ఇలాంటి వారికి అక్రిడిటేషన్లు వచ్చే విధంగా మా కమిటీ కృషి చేస్తుందని చెప్పారు. జీఓ ప్రకారం కాకుండా కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చి అక్రిడేషన్లు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఆమోదించిన వారికి వారం పది రోజుల్లో అక్రిడిటేషన్లు అందజేస్తారన్నారు. గతంలో అక్రిడిటేషన్ కమిటీ సమావేశం ఒక్కసారి మాత్రమే జరిగేదని.. ఇప్పుడు ఆరు నెలలకు ఒకసారి కమిటీ సమావేశం ఉంటుందన్నారు. రెండు నెలల్లోపు మరోసారి సమావేశం నిర్వహించి.. అందరికీ అక్రిడిటేషన్లు వచ్చేలా చూస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రామాంజనేయులు చెప్పారు.....

4
115 views