logo

ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలిన వైద్య విద్యార్థిని.

ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలిన వైద్య విద్యార్థిని

ఆంధ్రప్రదేశ్ : విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎనస్థీషియా పీజీ విద్యార్థిని డాక్టర్ బత్తుల దీపిక బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాత్రి 1.10 వరకూ బాగానే ఉన్న దీపిక.. అరగంటలోనే ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలిపోయారు. రాత్రి 1.40 సమయంలో తోటి పీజీ విద్యార్థులు ఆమెను గుర్తించి అత్యవసర వైద్యం అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే దీపిక చేతిపై ఇంజెక్షన్ గుర్తులుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, దీపిక స్వస్థలం అనంతపురం జడిల్లా కోవూరునగర్.

5
541 views