logo

మానవత్వం తో 25 మంది చెంచు మహిళలకు చీరల పంపిణీ..డాక్టర్ మనోరంజన్ ప్రతాప్.

నంద్యాల జిల్లా రుద్రవరం ఆయన మూగజీవాల పట్ల ఆప్యాయత కలిగి ఉండడమే కాకుండా ఎన్నో మూగజీవాలను తన హస్తవాసితో వైద్య సేవలు అందించి ప్రాణం పోశారు.అలాగే మనుషుల పట్ల కూడా ఆదర అభిమానాలు తో పాటు మానవత్వం చూపుతూ డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ 25 మంది చెంచు మహిళలకు చీరలు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. రుద్రవరం ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు గా పనిచేస్తున్న డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ రుద్రవరం మండలంలోని చిన్నయ్య స్వామి చెంచుగూడెంలో చెంచు మహిళలకు తన వంతు సహాయంగా తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం 25 మంది చెంచు మహిళలకుచీరలు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ భార్య స్వరూపారాణి, తల్లి సరోజనమ్మ పాల్గొన్నారు.

4
976 views