logo

తిక్క స్వామి ఉరుసులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ లోని తిక్క స్వామి దర్గా ఉరుసు మహోత్సవంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారి దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గత 75 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో కుల మతాలకతీతంగా నంద్యాల మరియు చుట్టుపక్కల ప్రాంతంలో వారు విశేషంగా తిక్క స్వామి వారి దర్గాను దర్శించుకుని ఉరుసు మహోత్సవంలో వేలాదిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.కౌన్సిలర్ కృష్ణమోహన్ , 24 వ వార్డు ఇన్చార్జి రహంతుల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూలు ఆజాద్, వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధిఅనిల్ అమృతరాజ్, జలిల్,మా బాషా,శ్రీను, అడ్వకేట్ పునీత్ కుమార్,కరీం ఖాన్, నవ్యాంధ్ర రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు కబీర్,సుబ్బమ్మ మరియు వార్డు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

0
0 views