logo

కల్వకుర్తి మున్సిపాలిటీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న పట్టణ రాజకీయాలు..!

ప్రతినిధి డా.సిద్ధిక్✍️

- 7,13,16,17, 18,19 వార్డ్ లలో ఆసక్తికరంగా మారను నా ఫలితాలు.

- మున్సిపాలిటీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోయే అభ్యర్థి పై పట్టణ ప్రజల ఆశలు.

- ప్రచారంలో ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు.

కల్వకుర్తి :
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికలు స్థానికంగా రాజకీయ వేడి పెంచాయి.పట్టణ అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ వంటి అంశాలే ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా నిలుస్తున్నాయి.మున్సిపల్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా విస్తృత ప్రచారం నిర్వహించాయి. ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్, బిఆర్ఎస్ , బిజెపి, ఎంఐఎం , పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్, సీపీఐ,బిఎస్పి, ఇతర అభ్యర్థులు గల్లీ గల్లీ తిరుగుతూ అభ్యర్థులు ప్రజలను కలిసి తమ సమస్యలు తెలుసుకుంటూ హామీలు ఇస్తున్నారు. గత పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికల పై నేతలు ఓటర్లకు వివరించారు.తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.మహిళలు, యువత, వృద్ధులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.కల్వకుర్తి మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో పోటీ తీవ్రంగా ఉండటంతో ఫలితాల పై ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు పట్టణ భవిష్యత్ అభివృద్ధి దిశను నిర్ధారించనున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.మొత్తంగా కల్వకుర్తి మున్సిపాలిటీ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా కొనసాగుతూ, పట్టణ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. కల్వకుర్తి మున్సిపాలిటీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సి ఉంది.

200
6404 views