logo

నేడు ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం జిల్లా పర్యటన


ఫిబ్రవరి 06: విజయనగరం జిల్లా. రాజాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఈ నెల 7వ తేదీన విజయనగరం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం 9.30 గంటలకు ఆయన విజయనగరం చేరుకుంటారు.
విజయనగరంలోని జిల్లా పరిషత్ అతిథిగృహంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గాల సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలు, భూ సమస్యలు, ఉపాధి, విద్య, గృహాలు, పెన్షన్లు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
అనంతరం ఉదయం 11 గంటలకు విజయనగరం నుంచి చీపురుపల్లికి బయలుదేరి అక్కడ కూడా స్థానిక సమస్యలపై వివరాలు తెలుసుకుంటారు. తదుపరి రాజాం నియోజకవర్గంలో పర్యటించి ఎస్సీ వర్గ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు అధికారులకు ఇవ్వనున్నట్లు సమాచారం.

5
389 views