logo

ఫోటోషూట్ చిత్రం విడుదల

రమేష్ & రాంప్రసాద్ క్రియేషన్స్ పతాకం పై ఆలూరి రమేష్ బాబు , రాంప్రసాద్ సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం "ఫోటో షూట్ " ఎట్టికేలకు విడుదల డేట్ ఖరారైనది . ఈ చిత్రం ప్రోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని , ఫిబ్రవరి 13 న విడుదల చేయనున్నట్టు ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ఆలూరి రమేష్ బాబు నిన్న తెలిపారు . ఈ చిత్రానికి మూల కథ రాంప్రసాద్ గారు . ప్రతిఒకలి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్య మైన ఘట్టం అప్పుడు చాలామంది ఫోటో షూట్ చేసుకుంటారు . దానివలన వచ్చే ఇబ్బందులు ఎలావుంటాయ్ . కొంతమంది జీవితాలను ఎలా నాశనం చేస్తాయి . అనే కథకు మాటలు ప్రసాద్ తనదైన శైలిలో చాలా చక్కగా రాశారు . ఈ చిత్రంలో రమేష్ బాబు , రాంప్రసాద్ , హేమ ,మాధవి ,భాస్కర్ , శ్రీనివాస్ , తదితరులు తమ నటనతో పాత్రలకు జీవం పోశారు . ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే , దర్శకత్వ బాధ్యతలను ప్రసాద్ నిర్వహించారు అని , ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని , పది కాలాలపాటు ప్రేక్షకుల మనసులో నిలిచే చిత్రాలలో ఒకటి కానుందని తెలిపారు

31
1323 views