నంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని చంపిన ప్రియురాలు
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
నంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని చంపిన ప్రియురాలు
ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ లో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్ ప్రేమ హత్యకు దారితీసింది. రతన్పూరు చెందిన ప్రసాద్ సూర్యవంశీకి రోషిణితో ప్రేమ వ్యవహారం ఉంది.
ఇటీవల వారిద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రసాద్ ఆమె నంబర్ను బ్లాక్ చేశాడు. ఆ కోపంతో రోషిణి అతడి హాస్టల్ కు వెళ్లి గుండెల్లో కత్తితో పొడిచింది. తీవ్ర గాయాలతో ప్రసాద్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.