logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జగన్ కు సనాతన ధర్మం అంటే చిన్న చూపు

జనసేన పార్టీ వీర మహిళలు పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో సీతంపేట జనసేన పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ,తిరుమలను దర్శించుకున్న ప్రతి ఒక్కరూ లడ్డూ ప్రసాదం రుచిని కోరుకుంటారు,అటువంటి లడ్డులో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిసిందని ఎన్.డి. టి.వి రిపోర్ట్స్లో వెల్లడించిందనీ

మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో
సనాతన ధర్మాన్ని కాపాడటానికి, లడ్డు కల్తీ మహా పాపమని,ఆ పాపం వలన వచ్చే అనర్ధాల నుండి ప్రజలకు నష్టం కలగకుండా ప్రాయశ్చిత్త దీక్ష చేయడం జరిగిందనీ
ఇటీవల తిరుమల లడ్డు ప్రసాదం సిట్ నివేదికను సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుందనీ సిట్ దర్యాప్తులో లడ్డు తయారీకి నెయ్యి అనే పదార్థం ఉపయోగించలేదని రిపోర్టు వచ్చిందనీ తెలిపారు.

లడ్డు తయారీలో మోనో గ్లిజరాయిడ్స్ అనే రసాయనాలు ఉన్నాయని రిపోర్ట్ లో వెళ్లడయింది అన్నారు. రసాయన పదార్థం,ప్రమాదకరమైనదనీ ,అన్నారు

వైసిపి ప్రభుత్వం నేడు పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షను వక్రీకరిస్తూ,అవహేళన చేస్తూ అవమానపరుస్తున్నారనీ తిరుమల లడ్డు కల్తీ అపరాధం చేసిన వైసిపి పార్టీని ప్రజలు తప్పకుండా శిక్షిస్తారు, దైవ సన్నిధిలో నరకం లో తప్పకుండా వారు ఈ బాధ అనుభవిస్తారు అని అన్నారు

జగన్మోహన్ రెడ్డికి సనాతన ధర్మంపై చిత్తశుద్ధి ఉంటే సతీసమేతంగా బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించకుండా ఆచారం పక్కన పెట్టేసారు, జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా ఒక్కరోజు కూడా తిరుపతి దర్శనం చేసుకోలేదు
తిరుపతి డిక్లరేషన్ పై వెళ్లాలనే సిద్ధాంతానికి జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడిచారు,జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతర్వేది, రామతీర్థం, కనకదుర్గ అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు అపచారం జరిగితే ఆఘటన పై బాధ్యత లేకుండా మాట్లాడారు,జగన్మోహన్ రెడ్డికి సనాతన ధర్మం అంటే చిన్న చూపు

మన మతాన్ని,పర మతాల్ని గౌరవించాలని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు
తెలుగుదేశం పార్టీ నాయకులు నేడు తిరుమల లడ్డు వ్యవహారం పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అల్లకల్లోలం సృష్టిస్తారని పోలీసు స్టేషన్లో రిపోర్ట్లు ఇస్తున్నారు

జగన్ పాలనలో పవన్ కళ్యాణ్ పల్లకిలు మోస్తున్నట్లు ఆనాడు ప్లెక్సీలు వేశారు ,అప్పుడు మీకు అల్లర్లు గుర్తుకు రాలేదా అన్నారు.

పవన్ కళ్యాణ్ ఆనాడ సంయమనం పాటించమని మాకు పిలుపునిచ్చారు, లేకపోతే వేరే విధంగా ఉండేదనీ హెచ్చరించారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు జారి ముఖ్యమంత్రి చంద్రబాబుని దూషించారు

బోలే బాబా డెయిరీ, వైష్ణవి డెయిరీ లకు కనీసం ఆవులు,డెయిరీలు లేవు

ఆవులు లేకుండా నెయ్యి తయారు చేయడం కేవలం వైసీపీ పార్టీకి మాత్రమే చెల్లింది

కిలో నెయ్యి 400రూపాయలకు ఇవ్వడం ఎక్కడ చూడలేదు

వైసీపీ పాలనలో 60లక్షల కల్తీ నెయ్యి సరఫరా చేసి 20 కోట్లు లడ్డులు తయారు చేశారు

తప్పకుండా వైసీపీ ప్రభుత్వం చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తారు,
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నాము. అంటూ వైసీపీ నాయకులను ఉద్దేశించి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉత్తరాంద్ర మహిళ కోఆర్డినేటర్స్ శారానిదేవి, అమరాపు దుర్గ, ఆర్యవైశ్య డైరెక్టర్ కొల్లూరి రూప, కనీస వేతనాల సంఘం డైరెక్టర్ తెలుగు లక్ష్మి, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వివిధ వార్డు మహిళ ప్రెసిడెంట్లు, వీరమహిళలు, పాల్గొన్నారు.

33
1087 views

Comment