కల్లుగీత కార్మికుల సమస్యలపై పితాని సత్యనారాయణ ని కలిసిన గీత కులాల ప్రతినిధులు...
కల్లుగీత కార్మికుల సమస్యలపై పితాని సత్యనారాయణ ని కలిసిన గీత కులాల ప్రతినిధులు.ఆచంట నియోజకవర్గం, ఫిబ్రవరి 04: ఆచంట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ పితాని సత్యనారాయణ నివాసాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత కులాల ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి కల్లుగీత కార్మికులకు ఐడి కార్డులు TCS TFT పెండింగ్ లైసెన్స్ లు రావలసిన రాయితీలు, రిజర్వేషన్లు తదితర అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా సహకరించాలని ప్రతినిధులు కోరారు.
•అదేవిధంగా, కల్లుగీత కార్మికుల సమస్యలపై మాజీ శాసనమండలి చైర్మన్ టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ని, అలాగే రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి ని కూడా ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు.
-ఈ కార్యక్రమంలో ఈడిగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకల వేణుగోపాల్, శ్రీశయన రాష్ట్ర అధ్యక్షులు లోడా అప్పారావు, యాత సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంగటి రాము, శెట్టి బలిజ రాష్ట్ర నాయకులు గుబ్బల బాబ్జి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.