logo

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం

గురజాల నియోజకవర్గం పరిధిలోని పిడుగురాళ్ల సమీపంలోని మాచవరం మండలం, పిన్నెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ గూండాలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన మందా సాల్మన్ రాజు ఘటనతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలపై జరిగిన టీడీపీ గూండాల దాడులపై జాతీయ ఎస్సీ కమిషన్ మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్‌లకు ఫిర్యాదు చేయుటకు ఢిల్లీకి వెళ్లిన మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ జూపూడి ప్రభాకర రావు గారు, ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జూపూడి ప్రభాకర రావు గారితో పాటు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ గురుమూర్తి గారు, మాజీ మంత్రి శ్రీ సురేష్ గారు, శ్రీ మేరుగు నాగార్జున గారు, ఎమ్మెల్సీ శ్రీ ఇజ్రాయిల్ గారు, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీ సుధాకర్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

14
1048 views