
విద్యార్థులకు కలుషిత ఆహారం అందజేయడంపై MG యూనివర్సిటీ VC గారికి BRSV వినతి పత్రం.
నల్గొండ: స్థానిక నల్లగొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో గల హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహారంలో అంబర్ ప్యాకెట్గు,(గుట్కా) రావడాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మరియు MG యూనివర్సిటీ నాయకులు గాదె శివ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ యూనివర్సిటీ ఏర్పడిన నాటి నుండి పలు సమస్యలతో యూనివర్సిటీ తాండవిల్లుతోంది అని అదే విధంగా ఈ రెండు సంవత్సరాల కాలంలో యూనివర్సిటీ హాస్టల్లో కలుషిత ఆహారం రావడం ఇది 6వ సారి అనిమండిపడ్డారు. మరియు విద్యార్థుల భోజనంలో గుట్కా ప్యాకెట్లు రావడం తెలంగాణ సమాజానికి తీరని మచ్చ అని ఆరోపించారు... ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క సంఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా VC గారు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విద్యా శాఖకి మంత్రి ని ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, యూనివర్సిటీ కళాశాలలకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో MG యూనివర్సిటీ నాయకులు చలకాని పరమేష్, కన్నబోయిన వంశీ,దాసరి మచ్చ గిరి, రాంబాబు, మహేష్, సైదులు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.