logo

ఎమ్మార్పీఎస్ నాయకుడిని అతికిరాతముగా హత్య చేయడం అమానూషం.

నంద్యాల (మన ప్రజాపక్షం): దళితులను హత్య చేయడం అమానుష్యమని నంద్యాల మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బండి దేవాంతకుడు మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి అన్నారు. మంగళవారం నాడు నంద్యాల పట్టణంలో మాలమొహనులు కార్యాలయంలో మాట్లాడుతూ తుగ్గలి మండలం బొందిమడుగు గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ ను అతికిరాతముగా హత్య చేయడం అమానుషమని ఖండించారు నిందితులను పై రౌడీ శీటర్ కూడా ఓపెన్ చేయాలని గ్రామ బహిష్కరణ చేయాలని రమేష్ కుటుంబానికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో పల్నాడు జిల్లాలో మంద ఏలియానా అతికిరాతకంగా చంపడం బనగానపల్లి మండలం ఎనకండ్ల గ్రామంలో దళిత మహిళపై అత్యాచారం హత్య చేయడం అమానుష్యమని వారు అన్నారు రాష్ట్రంలో దళిత హోం మంత్రి ఉండి కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కేశవుడు మాల మహానాడు యువజన నాయకులు బండి దేవదాసు తదితరులు పాల్గొన్నారు

0
0 views