logo

అదిలాబాద్ జిల్లా జానపద కళాకారులకు

అదిలాబాద్ జిల్లా జానపద కళాకారులకు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు జారీ చేస్తున్న సందర్భంగా జిల్లా లో ఉన్న గుస్సాడి, థింసా, కోయ, మథుర, డప్పు, తబల, హార్మోనియం,డోలు, కిక్రి, పన్నెండు మెట్ల కిన్నెర ,బుర్ర కథ, భజన, సంగీత వాయిద్య కళాకారులకి, జానపద గాయకులు, జానపద నృత్య కళాకారులు, కవులు, రచయితలు ప్రతి ఒక్కరు మన సంఘం లో సభ్యత్వం తీసుకున్న వారికి కష్ట కాలంలో అనగా అనుకోకుండా ప్రమాదం జరిగిన , నార్మల్ గా మరణించిన మన సంఘం సంక్షేమ నిధి ద్వారా 5 నుండి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. కావున ఇంకా ఎవరైతే తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం లో గుర్తింపు కార్డు కోసం ఆధారకార్డు జిరాక్ష్, రేషన్ కార్డు మరియు రెండు పాస్ ఫొటోలు ఈ చరవాణి 9703686368 కి సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధ్యక్షులు మిట్టు రవి తెలిపారు.ఇందులో మావల మండల అధ్యక్షులు రాజేశ్వర్ సంఘం బాధ్యులు పసుల లింగన్న, నారాయణ. జగన్నాథ ఋషి గాజుల పాల్గొన్నారు

4
312 views