వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ – నార్సింగి సర్కిల్ పరిధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ప్రభాకర్ అనే వ్యక్తి కొడుకు(2)పై దాడి చేసిన వీధి కుక్కలు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.