logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రజా సంక్షేమమే నా జీవితం.. * ఓటు వేసి గెలిపించండి : చల్లా రవీందర్ రెడ్డి - కరపత్రాలను విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే చందర్

పెద్దపల్లి/గోదావరిఖని, : ప్రజా సంక్షేమ కోసం నా జీవితం దారపొస్తానని, ఒక్కసారి నాకు ఓటు వేసి గెలిపించి డివిజన్ అభివృద్ధి చేసుకుందామని బిఆర్ఎస్ పార్టీ 50 డివిజన్ అభ్యర్థి చల్లా రవీందర్ రెడ్డి ప్రజలను కోరారు. ఇందులో భాగంగా సోమవారం డివిజన్ లో కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో తన ప్రచారం కోసం ముద్రించిన కరపత్రాలను మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రజా శ్రేయస్సుకోసం డివిజన్ అభివృద్ధి కోసం 50వ డివిజన్లో పోటీ చేస్తున్న రవీందర్ రెడ్డిని గెలిపించుకొని మీలో ఒక కుటుంబ సభ్యులుగా అక్కున చేర్చుకోవాలని మీ అమూల్యమైన ఓటుతో గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే డివిజన్ ప్రజలకు పిలుపునిచ్చారు. డివిజన్ లో అభివృద్ధి కోసం అతని మాటే ఒక క్రమశిక్షణ లా పట్టుదలతో చేసే అభివృద్ధిని ఉన్నది ఉన్నట్లు ముద్రించిన కరపత్రంలో ప్రజా శ్రేయస్సులో చల్లా రవీందర్ రెడ్డి ఆశయం ప్రజా సంక్షేమం అభివృద్ధి స్పష్టంగా కనబడుతుందని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్లో 50వ డివిజన్ లో బిఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న చల్లా రవీందర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని డివిజన్ సత్తా చూపెట్టాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు, గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.

21
994 views

Comment