logo

పాలవలస శ్రీనివాసరావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కొండంపేట వైసిపి నాయకులు

విజయనగరం జిల్లా. రాజాం.

రాజాం టౌన్ పార్టీ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ మరియు మెడికల్ క్యాంప్ రాజాం ప్రజలకు లబ్ధి చేకూర్చాయి. ఈ కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా ప్రారంభించి, ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేసినారు రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ మరియు శ్రీమతి డా. మాధవీలత.
కార్యక్రమంలో మాట్లాడుతూ డా. తలే రాజేష్, పాలవలస శ్రీనివాసరావు మంచికి మారు పేరు, నిగర్వి, స్నేహశీలి, నిస్వార్థపరుడు అని, పార్టీ ఆలోచనలు ప్రజల దాకా చేరవేయడంలో, జగనన్న సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరేలా చేయడంలో ఆయన పాత్ర కీలకమని తెలిపారు.
అతనికీ, నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావం కలిగిన నాయకుడిగా రాజాం టౌన్‌లో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని కూడా డా. తలే రాజేష్ తెలిపారు. కార్యక్రమం చివరలో పాలవలస శ్రీనివాసరావుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరియు ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాజాం మున్సిపాలిటీ పరిధి కొండంపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు సలాది తులసీదాసు మాస్టర్, ముద్దన సత్యారావు, సలాది సతీష్ కుమార్, దాకారపు శివ, ముత్యాల రాము, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

0
0 views