logo

రాత్రి వేళల్లో నిత్యం నిఘా...అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ల తో పరిశీలన... జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అసాంఘిక

రాత్రి వేళల్లో నిత్యం నిఘా...అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ల తో పరిశీలన...
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు, ఓపెన్ డ్రింకింగ్ పై ప్రత్యేక నిఘా..
జిల్లా వ్యాప్తంగా అనుమానాస్పద వ్యక్తులు, రాత్రి వేళల్లో చోరీలు అరికట్టడం లో భాగంగా పరిసర పట్టణాలలో తోపాటు అటవీ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక డ్రోన్‌ పర్యవేక్షణ నిర్వహించింది.
అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అక్రమ కార్యకలాపాలు, మరియు ప్రజా భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితులను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఆదివారం రాత్రి పుట్టపర్తి పట్టణంతోపాటు కర్ణాటక నాగేపల్లి పలు ప్రాంతాలలో పోలీసులు, డ్రోన్ సిబ్బంది డ్రోన్ ద్వారా అ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, మార్గాలు, చెరువులు, మరియు అనుమానాస్పదగా కనిపించే చలనాలను రికార్డు చేయడం జరిగింది.

అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.పోలీసు అధికారుల సమాచారం ప్రకారం, ఇటువంటి డ్రోన్ పర్యవేక్షణలు తరచుగా నిర్వహించడం ద్వారా పట్టణ మరియు మండల ప్రాంతాలలో నేర కార్యకలాపాలను అరికట్టడంలో పెద్దగా ఉపయోగపడుతుందని, ప్రజలు ఎటువంటి అనుమానాస్పద చలనం గమనించినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని పోలీసులు కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు సంఘటనలు, చోరీలు జరగకుండా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

0
90 views