logo

పాలకాయతిప్ప బీచ్ వద్ద ప్రశాంతంగా ముగిసిన మాఘ పౌర్ణమి వేడుకలు.

పాలకాయతిప్ప బీచ్ వద్ద ప్రశాంతంగా ముగిసిన మాఘ పౌర్ణమి వేడుకలు.
మాఘ శుద్ధ పౌర్ణమి మరియు ఆదివారం పురస్కరించుకుని కోడూరు మండలం హంసలదీవి పాలకాయతిప్ప బీచ్‌కు పోటెత్తిన భక్తులు, సందర్శకుల దృష్ట్యా పోలీసులు అత్యంత పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
జిల్లా ఎస్పీ వి. విద్యా సాగర్ నాయుడు ఐ‌పి‌ఎస్ గారి ఆదేశాలతో అవనిగడ్డ సీఐ జి. యువకుమార్, కోడూరు ఎఎస్‌ఐ కె. చాణక్య గారు పూర్తి బందోబస్తును పర్యవేక్షించారు.
మెరైన్ పోలీసులు మరియు గజ ఈతగాళ్లు సముద్ర తీరం వెంబడి నిరంతరం పహారా కాశారు. ప్రమాదకరమైన లోతైన ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా సందర్శకులను నిరంతరం హెచ్చరించారు.
గాలిలో డ్రోన్లను ఎగురవేస్తూ జనసమూహాన్ని నిశితంగా గమనించారు. దీనివల్ల రద్దీని క్రమబద్ధీకరించడం సులభతరమైంది.

0
0 views