కుప్పంలోని తుంసీ విలేజ్ హెల్త్ క్లినిక్ ను సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
కుప్పంలోని తుంసీ విలేజ్ హెల్త్ క్లినిక్ ను సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
శాంతిపురం మండలం తుంసీ విలేజ్ హెల్త్ క్లినిక్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు.
హెల్త్ రికార్డులకు సంబంధించి గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టు గా చేపట్టామని, సంజీవని సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నిపుణులైన వైద్యులతో చికిత్స చేయిస్తున్నామని, మందులు కూడా ఇస్తున్నామని తెలిపారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తున్నామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో నమోదైన వివరాలు డిజిటలైజ్ చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టును ఇటీవలే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించామని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వివరించారు.
#AndhraPradesh