logo

డాక్టర్ గణేశ్వరరావుకు గవర్నర్ గౌరవం సాలూరు ప్రజలకు ఆనందదాయకం



ప్రముఖ డాక్టర్ గణేశ్వరరావు ను గవర్నర్ నెట్వర్క్ ప్రోగ్రాం కి స్టేట్ కి పిలవడం, అభినందించడం మన సాలూరు ప్రజలకు ఆనందదాయకమని, గర్వపడుతున్నామని తెలియజేశారు. మాజీ కౌన్సిలర్ పి. రామకృష్ణ,తన తనయుడు పిరిడి రాహుల్ ఆధ్వర్యంలో దుప్పట్లు,పండ్లు, చేతి కర్రలు పంపిణీ చేశారు. అనంతరం సన్మానం చేశారు. ఆయన అందరికీ ఆదర్శంగా ప్రాణదాతగా నిలుస్తూ... ఎంతోమంది పేద రోగులకు ఉచిత చికిత్స కూడా అందించారని అన్నారు. అనంతరం మాదేటి వెంకట్రావు, వ్యాపారస్తులంతా కలిసి డాక్టర్ గణేష్ రావు ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బలగ రాధ, జిల్లెల్ల సీతారాం తదితరులు పాల్గొన్నారు.

0
141 views