logo

టిఆర్పి పార్టీ 7వ వార్డు అభ్యర్థికి మేదరి సంఘం మద్దతు...

మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 01/02/2026 : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ 7వ వార్డు అభ్యర్థిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున పోటీచేస్తున్న జోరిగే రజితకు మెట్ పల్లి మేదరి(మహేంద్ర) కుల సంఘసభ్యులు తమ పూర్తి మద్దతూ తెలిపారు.బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనారిటీ కులాల అభివృద్ధి ఒక్క తీన్మార్ మల్లన్నతోనే సాధ్యమని,మన రాజ్యాధికారం కోసం ఉద్యమమే సాగిస్తున్న తీన్మార్ మల్లన్న అడుగుజాడల్లో నడుస్తూ మేదరి కులం అభివృద్ధిలో నిరంతరం కృషి చేస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి, మెట్ పల్లి మున్సిపల్ 7వ వార్డు అభ్యర్థి జోరిగే రజిత హామి ఇవ్వడం జరిగిందన్నారు.సంఘ భవనం ఏర్పటుకు పూర్తి మద్దతు తెల్పుతూన్నట్లు ప్రకటించారు.తమకు మద్దతు తెలిపిన సంఘసభ్యులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు జోరిగే రజిత తెలిపారు.ఈ కార్యక్రమంలో మేదరి సంఘం అధ్యక్షులు మాదా నగేష్,ఉపాధ్యక్షులు చిలివేరి రాజేందర్,ఎనుగందుల బాలయ్య,గాంధారి జగన్,మాధ నర్సయ్య,జోరిగే గంగారాం, జోరిగే శ్రీనివాస్,మాధ స్వామి,ఎనుగందుల అంజయ్య,ఎనుగందుల రాజేందర్,పిల్లి గణేష్,సూరినీడా సందీప్,జోరిగే శ్రీనివాస్(జర్నలిస్ట్) తదితరులు పాల్గొన్నారు.

20
1292 views